లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎంపీడీవో, ఎంపీఓ: టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్న నర్సింహులపేట ప్రజలు!
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి తిమింగలాల వేట కొనసాగుతోంది. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల పరిషత్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు జరిపిన ఆకస్మిక దాడిలో ఇద్దరు ఉన్నతాధికారులు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
అసలేం జరిగిందంటే..?
నర్సింహులపేట మండలంలో ఒక వెంచర్ అనుమతికి సంబంధించిన ఫైలును ఆమోదించడానికి మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) రాధిక, మండల పంచాయతీ అధికారి (ఎంపీఓ) రూ. 45 వేలు లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఈ విషయమై ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా వ్యూహంతో ఉచ్చు పన్నారు. శుక్రవారం కార్యాలయంలోనే ఫిర్యాదుదారుడి నుంచి రూ. 45 వేల లంచం స్వీకరిస్తున్న తరుణంలో ఏసీబీ బృందం ఒక్కసారిగా దాడి చేసి ఎంపీడీవో రాధికను, ఎంపీఓను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఈ...
