ఫోర్ట్ రోడ్ బొడ్రాయి సన్నిధానంలో ఘనంగా మహా అన్నదానం
వరంగల్ ఫోర్ట్ రోడ్ లోని బొడ్రాయి సన్నిధానంలో అమావాస్యను పురస్కరించుకొని సోమవారం మహా అన్నదాన కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులకు కమిటీ సభ్యులు అన్న ప్రసాదాన్ని పంపిణీ చేశారు.
దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు
గత 19 నెలలుగా ఈ అన్నదాన కార్యక్రమం నిరంతరాయంగా సాగడానికి ఆర్థికంగా, ఇతర రూపాల్లో సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు కమిటీ సభ్యులు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నిరుపేదల ఆకలి తీరుస్తున్న దాతల సేవాభావం అభినందనీయమని, ఆ భగవంతుని ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉండాలని వారు ఆకాంక్షించారు.ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ అన్నదాన కార్యక్రమంలో వడ్డేపల్లి భరత్,గొర్రె చెరాలు,అప్రధపు సారంగపాణి,మంతిని చక్రధర్,పొన్నం కుమారస్వామి,కామ్మ రామ్మోహన్,తోట వీరభద్రం,కొత్తపల్లి శ్రీనుగుడికందుల ప్రగత్,గుణల మధుతోపాటు&n...
