Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతం (Bastar district) లోని అబుజ్మద్ అడవుల్లో భారీ కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 28 మంది మావోయిస్టులు మరణించినట్లు చెబుతున్నారు. నారాయణపూర్ పోలీస్ సూపరింటెండెంట్ ప్రభాత్ కుమార్ ప్రకారం, మావోయిస్టుల మాడ్ డివిజన్‌కు చెందిన అగ్రశ్రేణి క్యాడర్లు ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం మేరకు నారాయణపూర్, దంతెవాడ, బీజాపూర్, కొండగావ్ జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) బుధవారం తెల్లవారుజామున సంయుక్త ఆపరేషన్ ప్రారంభించాయి.
చత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రం బీజాపూర్ – నారాయణపూర్ జిల్లాల మధ్య గల మాడ్ డివిజన్ పరిధిలోని అబూజ్మాడ్ అడవుల్లో భద్రతా దళాలు సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. బుధవారం ఉదయం వారికి మావోయిస్టులు ఎదురుపడి జవాన్లపై కాల్పులు ప్రారంభించారు. దీంతో ఇరు వర్గాల మధ్య భీకర పోరు జరిగింది. ఇప్పటి వరకు ఈ ఎదురు కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా పోలీసు వర్గాలు భావిస్తున్నారు. ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లు నారాయణపూర్ జిల్లా ఎస్పీ ప్రభాత్ కుమార్ స్పష్టం చేశారు.
కాగా, ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో పోలీస్ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. మావోయిస్టులు(Maoists) గత మూడు నెలలుగా శాంతి చర్చలకు కాల్పుల విరమణ కావాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాస్తున్నప్పటికీ ఇలాంటి వరుస ఘటనలు కొనసాగుతుండడంపై సర్వత్ర చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ ఎదురు కాల్పుల ఘటనకు సంబంధించిన వివరాలు పోలీసులు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.









1 Comment
[…] నెల చివర్లో, బీజాపూర్ జిల్లాలో 24 మంది మావోయిస్టులు లొంగిపోయారు, వారిలో 14 మంది తలలపై […]