Teachers Photos in Govt Schools |తెలంగాణలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, గురుకులాల్లో విధులు నిర్వహిస్తున్న టీచర్ల ఫొటోలను అందరికీ కనిపించేలా ప్రదర్శించాలని.. పాఠశాల విద్యాశాఖ ఉత్వర్వులు జారీ చేసింది. ఈ మేరకు వెంటనే చర్యలు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డి ఆదేశాలిచ్చారు.
కొన్ని పాఠశాలల్లో ప్రభుత్వం నియమించిన ఉపాధ్యాయులకు బదులు ఇతర ప్రైవేట్ వ్యక్తులు విధులు నిర్వహిస్తున్నానే విషయం తమ దృష్టికి వచ్చిందని, ఈ విషయమై విద్యాశాఖకు పలుమార్లు ఫిర్యాదులు వచ్చాయని నరసింహారెడ్డి వెల్లడించారు. ఇలా ఒకరికి బదులు మరొకరు పనిచేస్తున్నట్లు నిర్ధారణ అయితే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కాగా ఖమ్మం జిల్లాలోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో కొందరు సీనియర్ ఉపాధ్యాయులు.. ఆయా గ్రామాలకు చెందిన కొందరు యువతీ యువకులకు రూ.10,000 వరకు వేతనాలు ఇచ్చి తమ స్థానంలో టీచర్లుగా నియమించినట్లు గుర్తించామని నరసింహ రెడ్డి తెలిపారు. ఇదే తరహాలో హైదరాబాద్‌తో పాటు కొన్ని జిల్లాల్లో కూడా ప్రభుత్వ టీచర్లకు డ్యూటీ (ఓడీ) సౌకర్యం లేకున్నా పాఠశాలలకు నెలల తరబడి హాజరుకావడం లేదనే ఆరోపణలు కూడా వస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్ పాతబస్తీలో కూడా ఇదే వ్యవహారం కొనసాగుతుందని కొందరు ఉపాధ్యాయుల స్థానంలో ప్రైవేట్ వ్యక్తులే టీచర్లుగా విధులు నిర్వర్తిస్తున్నట్లు తమకు ఫిర్యాదులు వచ్చాయిన నరసింహ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో కఠిన చర్యలకు ఉపక్రమించినట్లు చెప్పారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా ఎక్స్(ట్విట్టర్) లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








