KTR | హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాల పిల్లలకు అండగా నిలిచిన భారతరాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (బీఆర్‌ఎస్వీ) నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. విద్యార్థి నాయకులకు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం విద్యార్థి నేతలను అరెస్టు చేసి ఇప్పటికీ వారి ఆచూకీ చెప్పకుండా రాత్రంతా తిప్పుతారా అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజాపాలనలో ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని ఆయన మండి పడ్డారు. సమస్యలపై నిలదీస్తే నిర్బంధాలా?, బడిపిల్లలకు బాసటగా నిలిస్తే అరెస్ట్ చేస్తారా అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పురుగుల అన్నం పెడుతున్నారని ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని విమర్శించారు. గురుకుల సమస్యలపై, విద్యార్థుల ఆత్మహత్యలు, పిల్లల మరణాల గురించి నిలదీస్తే గొంతు నొక్కుతారా అని కేటీఆర్ ఫైర్ అయ్యారు. మా బీఆర్ఎస్‌వి నాయకులు ‘గురుకుల బాట’ చేస్తామంటే అంటే అడ్డుకుంటారా ని ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇటీవల కాలంలో గురుకులాలు, జిల్లా పరిషత్ స్కూళ్లల్లో ఫుడ్ పాయిజన్ (Food Poisoning) ఘటనలకు నిరసనగా మాసబ్‌ట్యాంక్‌లోని సంక్షేమ భవన్ వద్ద బీఆర్‌ఎస్వీ నేతలు బుధవారం ధర్నా చేపట్టారు. దీంతో పోలీసులు బిఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తోపాటు పలువురు విద్యార్థి నేతలను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యార్థుల మరణాలు కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలేనని విమర్శించారు. కేసీఆర్ హయాంలో దేశానికే దిక్సూచిగా నిలిచిన తెలంగాణ గురుకులాలు.. కాంగ్రెస్ ఏడాది పాలనలోనే పూర్తిగా అస్తవ్యస్తంగా మారాయని విమర్శించారు. కాంగ్రెస్ సర్కారు తీరుతో విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లపై నమ్మకం పోతోందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్వీ పర్యటిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ప్రజాపాలనలో ప్రశ్నిస్తే కేసులా ?
సమస్యలపై నిలదీస్తే నిర్బంధమా ?
*బడిపిల్లలకు బాసటగా నిలిస్తే అరెస్ట్ చేస్తారా ?
పురుగుల అన్నం పెడుతున్నారని ప్రశ్నిస్తే కేసులు పెడ్తారా ?
గురుకుల సమస్యలపై,విద్యార్థుల ఆత్మ హత్యలపై,పిల్లల మరణాలపై గళమెత్తితే గొంతు నొక్కుతారా ?
మా బిఆర్ఎస్వీ…
— KTR (@KTRBRS) November 28, 2024
One thought on “KTR | బడిపిల్లలకు బాసటగా నిలిస్తే అరెస్ట్ చేస్తారా ?”