Delhi | దేశ రాజధాని న్యూఢిల్లీ (Delhi)లో గురువారం ఉదయం ఒక్కసారిగా భారీ పేలుడు (Explosion) సంభవించింది. ప్రశాంత్ విహార్ (Prashant Vihar) ప్రాంతంలోని పీవీఆర్ (PVR) మల్టీప్లెక్స్ సమీపంలో గల ఓ స్వీట్ షాప్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పేలుడు ధాటికి సమీప ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గురువారం ఉదయం 11:48 గంటల ప్రాంతంలో స్వీట్ షాప్ వద్ద పేలుడు సంభవించినట్లు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందింది. దీంతో వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి హుటాహుటిన చేరుకున్నారు. ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టగా తెల్లటి పొడి వంటి పదార్థం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read | Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టుపై కదలిక
ఘటనా స్థలంలో పేలుడుకు సంబంధించి వచ్చిన కాల్‌ను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. పేలుడుకు గల కారణాలపై కూడా పోలీసు బృందం ఆరా తీస్తోంది. ప్రశాంత్ విహార్‌లోని సిఆర్‌పిఎఫ్ పాఠశాల సమీపంలో పేలుడు జరిగిన ఒక నెల తర్వాత తాజా ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుడులో పాఠశాల గోడ ధ్వంసమైంది, అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.