Parliament winter session | పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (Parliament winter session) బుధవారానికి వాయిదా పడ్డాయి సోమవారం ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. తొలుత ఇటీవలి కాలంలో మృతి చెందిన సభ్యులకు సంతాపం తెలిపారు. ఆ తర్వాత లోక్‌సభ (Lok Sabha) మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత అదానీ అంశంపై చర్చించాలని విపక్షాలు పట్టుబడ్డాయి. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ ఓంబిర్లా సభను బుధవారానికి వాయిదా వేశారు.
ఇక రాజ్యసభ (Rajya Sabha)లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఎగువ సభను చైర్మన్ ధన్‌కర్ బుధవారానికి వాయిదా వేశారు. ఉభయ సభలు బుధవారం ఉదయం 11 గంటలకు తిరిగి ప్రారంభం కానున్నాయి. డిసెంబరు 20 వరకు జరిగే ఈ సమావేశాల్లో కీలకమైన వక్ఫ్ (సవరణ) సహా 16 బిల్లులను (waqf bill ) కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అలాగే మణిపూర్ హింస, గౌతమ్ అదానీ అవినీతి చర్యలపై (Adani bribery case) యూఎస్ అరెస్ట్ వారెంట్, దిల్లీలో వాయు కాలుష్యం తదితర అంశాలపై ఈ సమావేశాల్లో బిజెపి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి.
One thought on “Parliament winter session | పార్లమెంట్ ఉభయ సభలు బుధవారానికి వాయిదా”