Sarkar Live

Google Willow | సాంకేతిక ప్రపంచంలో కొత్త శకం.. గూగుల్ విల్లో

Google Willow : గూగుల్ మరో అపూర్వ సాంకేతిక విప్లవానికి నాంది పలికింది. గూగుల్ విల్లో అనే త‌ర్వాతి త‌రం క్వాంటం కంప్యూటింగ్ చిప్‌ను ప్రకటించింది. నేటి అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ చేయగల పనిని ఇది ఐదు నిమిషాల్లో మాత్ర‌మే

Google Ai

Google Willow : గూగుల్ మరో అపూర్వ సాంకేతిక విప్లవానికి నాంది పలికింది. గూగుల్ విల్లో అనే త‌ర్వాతి త‌రం క్వాంటం కంప్యూటింగ్ చిప్‌ను ప్రకటించింది. నేటి అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ చేయగల పనిని ఇది ఐదు నిమిషాల్లో మాత్ర‌మే పూర్తి చేస్తుంద‌ని పేర్కొంది. అదే పనిని సూపర్ కంప్యూటర్‌కు 10 సెప్టిలియన్ సంవత్సరాలు (10,000,000,000,000,000,000,000,000 సంవత్సరాలు) పడుతుంద‌ని తెలిపింది.

క్వాంటం ఎరర్ కారెక్షన్‌లో అద్భుత ఫలితాలు

గూగుల్ క్వాంటం AI టీమ్ అందించిన అద్భుత ఫలితాల్లో క్వాంటం ఎరర్ కారెక్షన్ కీలకం. దీని ద్వారా క్యూబిట్స్ సంఖ్య పెరిగే కొద్దీ పొరపాట్లు గణనీయంగా తగ్గుతున్నాయని టోక్యో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ ఎమ్మెరిటస్, కోల్‌క‌తాలోని TCG CREST డైరెక్టర్ ప్రొఫెసర్ భాను దాస్ అన్నారు. క్వాంటం ఎరర్ కారెక్షన్‌లో అద్భుతమైన ఫలితాలు ఇస్తుంద‌ని తెలిపారు.

Google Willowతో విప్లవాత్మక మార్పులు

గూగుల్ విల్లో అనేది వైద్య ఆరోగ్య, వాతావరణం, బ్యాంకింగ్, వ్యాపారాలు, భద్రత, రక్షణ త‌దిత‌ర అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుంద‌ని అంటున్నారు నిపుణులు. అంతేకాకుండా ఇది ఉద్యోగావకాశాలను సృష్టించగలిగే మంచి ఆవిష్కరణ అంటున్నారు. .

వైద్య‌రంగంలో ప్ర‌ధాన పాత్ర‌

కంప్యూటింగ్ పనితీరును మెరుగుపరిచేందుకు, అల‌స‌త్వాన్ని త‌గ్గించేందుకు అనేక పరిశోధనలు, ఆవిష్కరణలు జరుగుతుంటాయి. అలాంటిదే గూగుల్ విల్లో. వైద్య‌రంగంలో గేమ్ చేంజ‌ర్‌గా ఇది నిలుస్తుందంటోంది గూగుల్‌. జన్యు, వైరస్‌లను వేగంగానూ క‌చ్చితంగా డీకోడ్ చేస్తుంద‌ట‌. COVID-19 మహమ్మారి సమయంలో వైరస్‌ను డీకోడ్ చేయడానికి 4-5 ఐదు నెలలు పట్టింది. విల్లో లాంటి క్వాంటం చిప్ ఉంటే ఈ ప్రక్రియ వేగంగానూ, క‌చ్చితంగానూ జ‌రిగేద‌ని అంటున్నారు నిపుణులు. వాతావరణ పరిశీలన, మోడలింగ్ సిస్టమ్స్ ఇంకా వంద శాతం క‌చ్చితత్వం కలిగి లేవ‌ని అంటున్నారు. వాతావరణ మార్పు లాంటి సవాళ్లను ఎదుర్కోవాలంటే మంచి వేగవంత, క‌చ్చితమైన సిస్టమ్స్ అవసరం ఉండ‌గా గూగుల్ విల్లో రావ‌డం ఒక అద్భ‌త ఆవిష్క‌ర‌ణ అని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

భ‌యాలు వ‌ద్దంటున్న ప్రొఫెస‌ర్‌ దాస్

Google Willow పట్ల ఉన్న భయాందోళనలను తిప్పి కొట్టారు ప్రొఫెస‌ర్ దాస్‌. గూగుల్ విల్లోతో ఎలాంటి అన‌ర్థాలు ఉండ‌బోవ‌ని తెలిపారు. “సమాజ అభివృద్ధికి టెక్నాలజీ గణనీయంగా తోడ్పడింది. 1990 దశకంలో బ్యాంకింగ్ రంగంలో కంప్యూటర్లపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. బ్యాంకింగ్ రంగం ఇప్పుడు డిజిటలైజ్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా విశేష‌ గుర్తింపు పొందింది” అన్నారు. ‘విల్లో’ అనేది వైద్యం, వాతావరణం, బ్యాంకింగ్, వ్యాపారాలు, భద్రత, రక్షణ తదితర అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి సామర్థ్యం ఉన్న అత్యద్భుత ఆవిష్కరణ అని తెలిపారు.
క్వాంటం కంప్యూటింగ్‌తో కృత్రిమ మేధస్సు (AI)ను అనుసంధానం చేసిన‌ప్పుడు భద్రత, రక్షణ, వ్యవసాయం, వ్యాపారం త‌దిత‌ర రంగాల్లో విప్లవాత్మక మార్పులకు నాంది ప‌లుకొచ్చ‌ని అన్నారు.

అనేక స‌మ‌స్య‌లు చెక్ పెడుతుంది..

కంప్యూటింగ్ పనితీరు నెమ్మ‌దించే స‌మ‌స్య‌ను నివారిచ‌డం, శక్తి వినియోగం, వేడి పంపకం వంటి అంశాలపై ఆధారపడుతుంద‌ని, క్వాంటం కంప్యూటింగ్ పెద్ద, సంక్లిష్ట గణనలను వేగంగా, తక్కువ శక్తితో ప్రాసెస్ చేస్తుందని వివరించారు. కంప్యూటింగ్ ప్రపంచం ఎలక్ట్రానిక్ నుంచి క్వాంటం-ఆధారిత భద్రతా వ్యవస్థాలకు మారుతున్న నేపథ్యంలో భవిష్యత్తు భద్రతపై మరింత పరిశోధన అవసరం అని అభిప్రాయ‌ప‌డ్డారు.



తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్, వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?