Ganja chocolates seized : గంజాయి స్మగ్లర్లు కొత్త మార్గాలను ఎంచుకున్నారు. నేరుగా సరఫరా చేస్తే పట్టుబడుతామనే భయంతో కొత్త పద్ధతులను ఎంచుకున్నారు. చాకెట్ల మాదిరి ప్యాకింగ్‌తో సప్లయ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఈ తరహా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఓ షాపులో నిన్న రాత్రి దాడులు చేసిన సైబరాబాద్ స్పెషన్ ఆపరేషన్ టీమ్ (SOT) పోలీసులు జగద్గిగిరిగుట్టలోని ఓ షాపులో వీటిని పట్టుకున్నారు.
2,400 చాక్లెట్లు స్వాధీనం
సైబరాబాద్ స్పెషన్ ఆపరేషన్ టీమ్ పోలీసులు 2,400 చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇవి మొత్తం 13 కిలోలల బరువు కలిగి ఉన్నాయి. అనంతరం బీహార్‌కు చెందిన సునీల్ కుమార్‌ను అరెస్టు చేశారు. అతడు బీహార్ నుంచి ఈ చాక్లెట్లను తెచ్చి హైదరాబాద్‌లోని స్థానిక కూలీలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఇంకెవరెవరు ఉన్నారు.. ఎవరి అండదండలతో వీరు ఈ దందా చేస్తున్నారు ? అనే విషయాలపై SOT కూపీ లాగుతోంది.
పెను సవాల్‌గా Ganja సరఫరా
తెలంగాణ రాష్ట్రంలో గంజాయి సరఫరా ఒక పెద్ద సమస్యగా మారింది. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగు విస్తృతంగా జరుగుతోంది. ఈ ప్రాంతాల్లో పండించిన గంజాయి తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు అక్రమ రవాణా అవుతోంది. రైలుతోపాటు వివిధ వాహనాల ద్వారా రహస్యంగా దీనిని చేరవేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్ వంటి నగరాల్లో గంజాయి వినియోగం అధికంగా ఉంది. విద్యార్థులు, యువత ఈ మాదకద్రవ్యానికి అలవాటుపడుతున్నారు.
కఠిన చర్యలు తీసుకుంటున్నా…
తెలంగాణ పోలీసులు, నార్కోటిక్స్ విభాగం గంజాయి సరఫరాను నియంత్రించడానికి పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ గంజాయి దందా ఇంకా కొనసాగుతూనే ఉంది. వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక సోదాలు నిర్వహిస్తున్నా, రవాణా మార్గాలను కట్టడి చేస్తున్నా దీని సరఫరాకు అడ్డుపడటం లేదు. పెద్ద ఎత్తున గంజాయి నిల్వలను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపుతున్నారు. అయినా ఈ అక్రమ వ్యాపారం కొనసాగుతూనే ఉంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..