- హన్మకొండ ఆర్టీఏ కార్యాలయంలో లంచాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే…
- హోదాను బట్టి లంచాలు… ప్రైవేట్ అసిస్టెంట్ లతో వసూళ్లు..
- కార్యాలయంలో తీసుకుంటున్న లంచాలు చూస్తే ACB అధికారులు సైతం ఆశ్చర్యపోవాల్సిందే..
ACB | హన్మకొండ ఆర్టీఏ కార్యాలయంలో ఆ అధికారులు తీసుకుంటున్న లంచాలను చూస్తే “ACB” అధికారులు సైతం ఆశ్చర్యపోతారని, లంచాల వివరాలు చూస్తే వారు షాక్ కు గురికాక తప్పదని వాహనదారులు అంటున్నారు. గత రెండు రోజులుగా “సర్కార్” వెబ్ సైట్ ప్రచురిస్తున్న వరుస కథనాలను గమనిస్తున్న వాహనదారులు.. హన్మకొండ ఆర్టీఏ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై ఎవరికి వారే అవును ఇది నిజం నాకూ ఇలాగే జరిగింది.. నేను కూడా ఫలానా పనికి (సేవకు) కార్యాలయం వెలుపల ఉన్న అధికారుల ప్రైవేట్ అసిస్టెంట్ వద్ద లంచం ఇచ్చి పత్రాలపై కోడ్(చుక్క) ను వేపించుకుంటేనే పని అయింది అని చర్చించుకుంటున్నారు. ఆర్టీఏ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిని ఎలాగైనా “అవినీతి నిరోధక శాఖ “అధికారులకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే “సర్కార్” వెబ్ సైట్ లంచాల వివరాలను ప్రచురిస్తోంది. ఏ పనికి(సేవకు) ఎంత లంచం వసూలు చేస్తారు? అందులో నుంచి డీడీసీ/డీటీవో, ఎంవీఐ(మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్), ఏవో(సూపరింటెండెంట్), క్లర్క్ (జూనియర్ అసిస్టెంట్/సీనియర్ అసిస్టెంట్) లకు ఎంత ముడుతోంది.. వివరాలు కింది పట్టికలు చూస్తే ఈజీగా అర్థమవుతుంది.
ACB అధికారులు గమనించాలి..
ఆర్టీఏ కార్యాలయంలో ఎవరు కూడా డైరెక్ట్ గా లంచాలు తీసుకోరు. కేవలం వారి ప్రైవేట్ అసిస్టెంట్ల ద్వారానే వసూళ్లకు పాల్పడతారు అది కూడా కోడ్ (చుక్కల) రూపంలోనే …
లైసెన్స్ కేటగిరీ
సర్వీస్ | ప్రభుత్వ ఫీజు | లంచం |
---|---|---|
లెర్నింగ్ లైసెన్స్ కు | రూ.450 | ఎంవీఐకి రూ. 900 క్లర్క్ కు రూ.100 |
పర్మినెంట్ లైసెన్స్ | రూ.1335 | ఎంవీఐ రూ.1500 |
హెవీ లైసెన్స్ | రూ.1600 | ఎంవీఐకి రూ.3300 |
ట్రాన్స్ పోర్ట్ లైసెన్స్ | రూ.1335 | ఎంవీఐకి రూ.2100 |
కొత్త వాహన రిజిస్ట్రేషన్లు
సర్వీస్ | ప్రభుత్వ ఫీజు | లంచం |
---|---|---|
టూ వీలర్ | లేదు | ఎంవీఐకి రూ.250 ఏవోకు రూ.100 క్లర్క్ కు రూ.100 |
కార్లు | లేదు | ఎంవీఐకి రూ.600 ఏవోకు రూ.200 క్లర్క్ కు రూ.200 |
త్రీవీలర్ & ఆటో రిక్షా ప్యాసింజర్ | లేదు | డీటీవోకు రూ.2000 ఎంవీఐకి రూ.600 ఏవోకు రూ.200 క్లర్క్ కు రూ.200 |
ఎల్ఎంవీ గూడ్స్ | లేదు | డీటీవోకు రూ.200 ఎంవీఐకి రూ.1200 ఏవోకు రూ.200 క్లర్క్ కు రూ.200 |
ట్రాక్టర్ ట్రాలీ | లేదు | డీటీవోకు రూ.800 ఎంవీఐకి రూ.1500 ఏవోకు రూ.300 క్లర్క్ కు రూ.300 |
మోటార్ క్యాబ్ | లేదు | డీటీవోకు రూ.2200 ఎంవీఐకి రూ.1400 ఏవోకు రూ.500 క్లర్క్ కు రూ.500 |
మీడియం గూడ్స్ వెహికిల్ | లేదు | డీటీవోకు రూ.2200 ఎంవీఐకి రూ.2200 ఏవోకు రూ.500 క్లర్క్ కు రూ.500 |
హెవీ గూడ్స్ వెహికిల్ | లేదు | డీటీవోకు రూ.3200 ఎంవీఐకి రూ.5500 ఏవోకు రూ.1000 క్లర్క్ కు రూ.1000 |
జెసిబి | లేదు | డీటీవోకు రూ.2200 ఎంవీఐకి రూ.2400 ఏవోకు రూ.500 క్లర్క్ కు రూ.500 |
హార్వెస్టర్ | లేదు | డీటీవోకు రూ.5500 ఎంవీఐకి రూ.2400 ఏవోకు రూ.1000 క్లర్క్ కు రూ.1000 |
ఫిట్ నెస్
సర్వీస్ | ప్రభుత్వ ఫీజు | లంచం |
---|---|---|
ఆటో రిక్షా | రూ.600 | ఎంవీఐకి రూ.400 క్లర్క్ కు రూ.100 |
ఎల్ఎంవీ గూడ్స్ | రూ.800 | ఎంవీఐకి రూ.1000 క్లర్క్ కు రూ.100 |
ట్రాక్టర్, ట్రాలీ | రూ.800 | ఎంవీఐకి రూ.1400 క్లర్క్ కు రూ.100 |
మోటార్ క్యాబ్ | రూ.800 | ఎంవీఐకి రూ.900 క్లర్క్ కు రూ.100 |
మీడియం గూడ్స్ వెహికిల్ | రూ.1000 | ఎంవీఐకి రూ.1800 క్లర్క్ కు రూ.100 |
హెవీ గూడ్స్ వెహికిల్ | రూ.1000 | ఎంవీఐకి రూ.2200 క్లర్క్ కు రూ.100 |
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
2 Comments
[…] కుణ్ణంగా పరిశీలిస్తున్నామని అటవీ అధికారులు తెలిపారు. పెంచికల్పేట్ పరిధిలోని […]
[…] చెక్ పోస్ట్ అయినటువంటి భోరజ్ లో వసూళ్ల దందా జోరుగా సాగుతోంది. ప్రతి రోజు వేల […]