Modi Kuwait Visit : కువైట్ సింగర్ ముబారక్ అల్ రాషీద్ (Mubarak Al Rashed) మన దేశభక్తి గీతాన్ని ఆలపించారు. సారే జహాన్ సే అచ్ఛా అంటూ ఆహూతులను ఆకట్టుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ పర్యటనలో భాగంగా ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన ఈవెంట్‌లో రాషీద్ ఈ పాటను పాడటంతో కువైట్ వాసులు మంత్రముగ్ధులయ్యారు. ప్రవాస భారతీయుల్లో భావోద్వేగం ఉప్పొంగింది. మనదేశం గొప్పదానాన్ని కువైట్ కొనియాడటంపై హర్షం వ్యక్తం చేశారు.
మోదీ గొప్పగా మాట్లాడారు : రాషీద్
ముబారక్ అల్ రాషీద్ ANIతో మాట్లాడుతూ కువైట్, భారతదేశం మధ్య బలమైన సంబంధంపై గర్వపడుతున్నాను. నా దేశం కువైట్ గొప్పదనం గురించి భారత ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi) గొప్పగా వర్ణించారు. రెండు దేశాల మధ్య సంబంధం గురించి ఆయన బాగా మాట్లాడారు. ఆయన కువైట్ (Kuwait) ప్రజలకు భారతదేశాన్ని సందర్శించాలని కోరడం ఆనందాన్ని ఇచ్చింది అన్నారు.
భారతీయ కార్మికులతో మోదీ మమేకం
కువైట్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మొదటిగా గల్ఫ్ స్పిక్ లేబర్ క్యాంప్‌ను సందర్శించారు. ఇది కువైట్‌లోని మినా అబ్దుల్లా ప్రాంతంలో ఉన్న 1,500 మంది భారతీయులతో కూడిన వర్క్‌ఫోర్స్ కేంద్రం. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులతో మోదీ మమేకమయ్యారు, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కొంతమంది కార్మికులతో కలిసి భోజనం చేశారు.
కువైట్‌లో భారతీయులు మొత్తం జనాభాలో 21 శాతం (1 మిలియన్ల పైగా) ఉన్నారు. అక్కడ ఉన్న భారతీయ జనాభాలో 30 శాతం (సుమారు 9 లక్షలు) వర్క్‌ఫోర్స్‌లో ఉన్నారు. మోదీ తన కువైట్ సందర్శన మొదటి కార్యక్రమంగా కువైట్‌లోని మినా అబ్దుల్లా ప్రాంతంలోని గల్ఫ్ స్పిక్ లేబర్ క్యాంప్‌ను సందర్శించారు. అక్కడ 1,500 మంది భారతీయ కార్మికులు పనిచేస్తున్నారు. తన పర్యటనలో భాగంగా పీఎం మోదీ ఆదివారం బయాన్ ప్యాలెస్‌లో కువైట్ దేశాధికారులతో చర్చలు జరపారు. ముందుగా సంప్రదాయ గార్డ్ ఆఫ్ ఆనర్‌ను స్వీకరించారు.
రెండు రోజులుగా Modi Kuwait Visit
ప్రధాని మోదీ పర్యటన కువైట్‌లో రెండు రోజులుగా సాగుతోంది. ఈ రోజు ముగుస్తుంది. 43 సంవత్సరాల తర్వాత గల్ఫ్ దేశానికి భారత ప్రధాని చేసిన తొలి పర్యటన ఇది. కువైట్ రాజు షేక్ మేశాల్ అల్ అహ్మద్ అల్ జబేర్ అల్ సబాహ్ (Sheikh Meshal Al-Ahmad Al-Jaber Al-Sabah) ఆహ్వానం మేరకు మోదీ ఆ దేశంలో పర్యటించారు. రెండు దేశాల మధ్య పెరుగుతున్న సత్సంబంధాలకు ప్రతీకగా ఈ టూర్ నిలుస్తుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవువుతోంది. .
భారత్-కువైట్ మధ్య వాణిజ్య సంబంధాలు
భారత్, కువైట్ మధ్య బలమైన వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా శక్తి రంగంలో భారతదేశానికి కువైట్ అగ్ర వ్యాపార భాగస్వామిగా ఉంది. ఈ నేపథ్యంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో ద్వైపాక్షిక వాణిజ్యం 10.47 బిలియన్ డాలర్లకు చేరుకుంది. భారతదేశం, కువైట్ మధ్య చారిత్రాత్మకంగా సన్నిహిత , స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. ఇవి ఆర్థిక సంబంధాలు, ప్రజల మధ్య అనుబంధాలతో బలపడినవి. కువైట్‌కు భారతదేశం ప్రధాన వ్యాపార భాగస్వామి అని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) పేర్కొంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..