Stone Pelting Outside Allu Arjun House | హైదరాబాద్‌లోని నటుడు అల్లు అర్జున్ నివాసంపై ఓయూ జేఏసీతో పేరుతో కొందరు దుండగులు దాడి చేశారు. కొందరు వ్యక్తులు జూబ్లీహిల్స్ నివాసంపై రాళ్లు, టమోటాలు విసిరి ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఇంటి లోపల ఉన్న పూల కుండీలు కూడా దెబ్బతినడంతో గందరగోళం నెలకొంది.రేవతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ బృందం నినాదాలు చేసింది. అల్లు అర్జున్ నివాసం వద్ద టమోటాలు విసిరే సమయంలో వారు వ్యక్తిగత సిబ్బందిని కూడా అడ్డుకున్నారు.
డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని సినిమా హాల్‌లో ప్రీమియర్ షోకి వచ్చిన సమయంలో తొక్కిసలాట కారణంగా మరణించిన 35 ఏళ్ల మహిళ కుటుంబానికి కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నటుడి ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన జరిగినప్పుడు అల్లు అర్జున్ తన నివాసంలో లేకపోవడం గమనార్హం.
అల్లు అరవింద్ ఏమన్నారు?
కాగా ఈ ఘటనపై అల్లు అరవింద్ స్పందించారు. తమ ఇంటి ముందు జరిగిన ఘటన అందరూ చూశారని, తాము సంయమనం పాటించాల్సిన సమయమని.. అందుకే సైలెంట్ గా ఉన్నామని తెలిపారు. ఇంటికి జూబ్లీహిల్స్ పోలీసులు వచ్చి దాడిచేసినవారిని తీసుకెళ్లారని తెలిపారు.ఎవరైనా గొడవ చేయడానికి వస్తే తీసుకెళ్లడానికి పోలీసులు సిద్ధంగానే ఉన్నారని తెలిపారు. ఎవరూ ఇలాంటి దాడులను ప్రేరేపించొద్దని కోరారు. దయచేసి అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
సినీ ప్రముఖుల ఇండ్లపై దాడిని ఖండిస్తున్నా..
సినీ ప్రముఖుల ఇండ్లపై దాడిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖండించారు. రాష్ట్రంలోనూ శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ విషయమై చర్యలు తీసుకోవాలని డీజీపీ, నగర పోలీస్ కమిషనర్‌లను ఆదేశించారు. ఈమేరకు ఆదివారం ‘ఎక్స్ లో పోస్టు చేశారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదన్నారు.అలాగే సంధ్య థియేటర్ ఘటన విషయంలో సంబంధం లేని పోలీసులు స్పందించవద్దని పేర్కొన్నారు. ఇతర సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Completely unacceptable breakdown of law and order in Hyderabad… protesters go on a rampage outside Allu Arjun’s residence pic.twitter.com/OmnqFbdt93
— Akshita Nandagopal (@Akshita_N) December 22, 2024
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..