SBI PO Recruitment 2025 : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 2025 సంవత్సరానికి ప్రొబేషనరీ ఆఫీసర్ల (POs) నియామక ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. SBI PO 2025 రిజిస్ట్రేషన్ ఈరోజు (2024 డిసెంబర్ 27) ప్రారంభమైంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను అధికారిక SBI వెబ్‌సైట్ sbi.co.in ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు.
SBI PO నియామక ప్రక్రియలో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుకు 600 ఖాళీలను అందుబాటులో ఉంచారు. భారత బ్యాంకింగ్ రంగంలో కెరీర్ సాధించాలని ఆశించే వారికి ఇది సదవకాశం. ఆసక్తి గల అభ్యర్థులు SBI PO 2025 రిజిస్ట్రేషన్‌తోపాటు దరఖాస్తు సమర్పణ ప్రక్రియను 2025 జనవరి 16 లోపు పూర్తి చేయాలి. అభ్యర్థులు SBI PO 2025 రిజిస్ట్రేషన్, దరఖాస్తు ఫారం, ఫీజు చెల్లింపు వివరాలు ఇలా ఉన్నాయి.
SBI PO 2025 పోస్టుల వివరాలు
- ఖాళీలు: 600
- అర్హతలు: అభ్యర్థి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయవచ్చు. - వయోపరిమితి: అభ్యర్థుల వయసు 01-04-2024 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
- జీత భత్యాలు: నెలకు రూ. 48,480 నుంచి రూ. 85,920 వరకు.
- దరఖాస్తు ఫీజు: రూ. 750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు మినహాయింపు)
SBI PO Recruitment 2025 ఎంపిక ప్రక్రియ
- ఫేజ్ 1: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్
- ఫేజ్ 2: మెయిన్ ఎగ్జామినేషన్
- ఫేజ్ 3: సైకోమెట్రిక్ టెస్ట్
- గ్రూప్ ఎక్సర్‌సైజ్
- ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఎగ్జామినేషన్
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: డిసెంబర్ 27, 2024
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 16, 2025
- ప్రిలిమినరీ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్: ఫిబ్రవరి చివరి వారం, 2025
- ప్రిలిమినరీ పరీక్ష తేదీలు: మార్చి 8, 15
- ప్రిలిమినరీ ఫలితాల ప్రకటన: ఏప్రిల్ 2025
- మెయిన్ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్: ఏప్రిల్ రెండో వారం
- మెయిన్ పరీక్ష తేదీ: ఏప్రిల్/మే 2025
- మెయిన్ ఫలితాల ప్రకటన: మే/జూన్ 2025
- ఫేజ్ 3 కాల్ లెటర్ డౌన్‌లోడ్: మే/జూన్ 2025
- సైకోమెట్రిక్ టెస్ట్: మే/జూన్ 2025
- ఇంటర్వ్యూ, గ్రూప్ ఎక్సర్‌సైజ్ తేదీలు: మే/జూన్ 2025
- తుది ఫలితాల ప్రకటన: మే/జూన్ 2025
SBI PO 2025 దరఖాస్తు ఫారం
అభ్యర్థులు SBI PO 2025 దరఖాస్తు ఫారాన్ని ఈ లింక్ (sbi.co.in) ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తి చేయడానికి అభ్యర్థులు యాక్టివ్‌లో ఉన్న మొబైల్ నంబర్ , ఈ-మెయిల్ ఐడీ కలిగి ఉండాలి.
- SBI అధికారిక వెబ్‌సైట్ sbi.co.in సందర్శించండి.
- హోమ్‌పేజీపై ప్రకటనకు ఎదురుగా Apply Online బటన్‌పై క్లిక్ చేయండి.
- వ్యక్తిగత, విద్య సంబంధిత వివరాలను నమోదు చేసి పరీక్షకు రిజిస్టర్ అవ్వండి.
- పాస్‌పోర్టు సైజ్ ఫొటో, సంతకం స్కాన్ చేసిన చిత్రాలను సూచించిన విధంగా అప్లోడ్ చేయండి. 5. హ్యాండ్ రిటన్ (చేతి రాత) డిక్లరేషన్, ఎడమ వేలిముద్రను అప్లోడ్ చేయండి.
- దరఖాస్తు ఫీజును చెల్లించండి (జనరల్ అభ్యర్థులకు రూ. 750 , SC/ST/PwBD అభ్యర్థులకు ఫీజు లేదు). 7. దరఖాస్తు ఫారం సమర్పించాక దాని ప్రింటౌట్ తీసుకోండి.
ముఖ్య గమనిక
SBI PO హ్యాండ్‌రిటన్ డిక్లరేషన్న్ చాలా కీలకం. అభ్యర్థి ఇది సమర్పించకపోతే దరఖాస్తు ఫారాన్ని స్వీకరించరు. SBI PO 2025 నోటిఫికేషన్ లో హ్యాండ్‌రిటన్ డిక్లరేషన్ ఫార్మాట్ అందుబాటులో ఉంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..