BJP leader Annamalai : తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అన్నా యూనివర్సిటీలో 19 సంవత్సరాల యువతిపై జరిగిన లైంగిక దాడిపై ఆందోళనకు దిగిన ఆయన తనను తాను కొరడాతో కొట్టుకున్నారు. ఈ ఘటనపై కొన్నిరోజులుగా అన్నామలై (BJP leader Annamalai) నిరసనలు తెలుపుతున్నారు. తమిళనాడులో డీఎంకే (DMK) ప్రభుత్వాన్ని తొలిగించే వరకు 48 రోజులపాటు ఉపవాసం ఉంటానని, చెప్పులు ధరించనని భీష్మించుకున్నారు. నిన్న బీజేపీ, అన్నాడిఎంకే (AIADMK) నేతలు నిరసన చేపట్టగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Annamalai : లైంగిక దాడిపై బీజేపీ నిరసనలు
అన్నా యూనివర్సిటీ (Anna University) క్యాంపస్‌లో ఈనెల 23న ఓ విద్యార్థినిపై లైంగిక దాడి జరిగింది. ఈ ఘటనను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఓ యువకుడితో ఆ యువతి యూనివర్సిటీ క్యాంప్‌లో ఉండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు లోపలికి వచ్చి అతడిని కొట్టి, ఆమెపై లైంగిక దాడి చేశారని బీజేపీ నేతలు తెలిపారు. డీఎంకే పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందర రాజన్ (Tamilisai Soundararajan) ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ యువతిపై లైంగిక దాడి జరిగినా పట్టించుకోని ప్రభుత్వం.. దీన్ని ప్రశ్నిస్తున్న తమ గొంతులను నొక్కాలని యత్నిస్తోందని మండిపడ్డారు.
తమిళగ వేట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ మాట్లాడుతూ ఈ దారుణ ఘటనపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడంలో డీఎంకే ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..