Accident in Madhapur : హైదరాబాద్‌లోని మాదాపూర్ (Madhapur) లో హోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు యువకులు బైక్‌పై అతి వేగంగా వెళ్తూ డివైడర్‌ను ఢీకొన్నారు. దీంతో ఇద్దరూ ప్రాణాలు వదిలారు. డివైడర్‌కు ఢీకొనడంతో బైక్ నుంచి మంటలు రావడం ఈ ప్రమాద తీవ్రతను సూచిస్తోంది. బైక నడిపేటప్పుడు హెల్మెంట్ ధరించలేదని తెలుస్తోంది. ఈ దృశ్యాలను సీసీ కెమెరాల్లో (CCTV footage ) నమోదయ్యాయి.
భయానక దృశ్యం
హైదరాబాద్‌లోని బోరబండాకు చెందిన రఘుబాబు (29) ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ ((Software Company))లో ఉద్యోగం చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఆకాంక్ష్ (27) ఐటీ రంగంలో కొత్తగా చేరాడు. ఇద్దరూ మంచి స్నేహితులు. వారిని చివరిసారి ఓ బార్‌షాపులో చూసినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. శుక్రవారం రాత్రి వీరద్దరూ బైక్‌పై బయల్దేరారు. మద్యం మత్తు ద్విచక్రవాహనాన్ని అతివేగంగా నడపడంతో అది అదుపు తప్పి డివైడర్‌ను ఢొకొంది. దీంతో ఇద్దరూ దూరంగా ఎగిరిపడ్డారు. బైక్ నుంచి మంటలు చెలరేగడంతో అది పూర్తిగా కాలిపోయింది. ఘటన స్థలంలోనే రఘుబాబు ప్రాణాలు వదిలాడు. 108 వాహనంపై ఆస్పత్రికి తరలిస్తుండగా ఆకాంక్ష్ మార్గమాధ్యలోనే మృతి చెందాడు. బైక్ మంటల్లో చిక్కుకోవడం భయానక దృశ్యాన్ని సృష్టించింది.
మద్యం మత్తులో..
అజాగ్రత్త వల్లే ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు సీసీ ఫుటేజీల ద్వారా నిర్ధారించారు. భారత శిక్షా స్మృతి (IPC) 304-A సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ప్రమాద సమయంలో బైక్ ఎవరు నడుపుతున్నారో ఇంకా నిర్ధారణ కాలేదు. బైక్‌ను అతి వేగంగా నడపడం వల్ల అది అదుపు తప్పిందని గుర్తించారు. మృతులు ఇద్దరూ మద్యం (Alcohol) మత్తులో ఉన్నారని అనుమానిస్తున్నారు. వీరి రక్త నమూనాను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.
హైదరాబాద్‌లో తరచూ రోడ్డు ప్రమాదాలు
హైదరాబాద్ నగర రోడ్లపై ద్విచక్రవాహనాల ప్రమాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అత్యధిక జనసాంద్రత, రోడ్లపై భారీ వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వీటికి ప్రధాన కారణాలు. ముఖ్యంగా యువత అధిక వేగంతో డ్రైవింగ్ చేయడం, హెల్మెట్ ధరించకపోవడం, మద్యం సేవించి వాహనం నడపడం ఈ ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ద్విచక్రవాహన ప్రమాదాల్లో ఎక్కువగా 18-35 సంవత్సరాల మధ్య వయసున్న వారు మరణిస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది. హైదారాబాద్‌లోని మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ వంటి ఐటీ హబ్ ప్రాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల ప్రమాదాల సంఖ్య కూడా ఎక్కువగా కనిపిస్తోంది. ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపడుతున్నప్పటికీ ప్రజలు నిబంధనలు పాటించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..