Charlapalli Railway Station : రూ.413 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో ఆధునీకరించిన చర్లపల్లి రైల్వే స్టేషన్ త్వరలో అందుబాటులోకి రానుంది. అయితే ఈరోజు డిసెంబర్ 28, 2024న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కొత్త రైల్వే టెర్మినల్ ను ప్రారంభించాల్సి ఉండగా మరోసారి వాయిదా పడింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి కారణంగా ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం సంతాప దినాలు కొనసాగుతున్న నేపథ్యంలో రైల్వే టెర్నినల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు సమాచారం. త్వరలోనే మరో తేదీని ప్రకటించే చాన్స్ ఉంది.
కాగా, హైదరాబాద్-సికింద్రాబాద్ జంటనగర ప్రాంతానికి చర్లపల్లిని కీలక రైల్వే టెర్మినల్‌గా మార్చాలని ఇండియన్ రైల్వే నిర్ణయించింది. పెరుగుతున్న ప్రయాణీకుల రద్దీని తగ్గించేందుకు సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ. లింగంపల్లి వంటి ప్రస్తుత టెర్మినల్స్ పై భారం తగ్గించేందుకు చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను దాదాపు రూ. 413 కోట్లతో అభివృద్ధి చేశారు.
వ్యూహాత్మక స్థానంగా చర్లపల్లి
Charlapalli Railway Station ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ తూర్పు వైపున ఉన్న చర్లపల్లి టెర్మినల్‌కు ప్రధాన ప్రదేశంగా గుర్తించారు. అందుకే ఈ స్టేషన్‌లో కొత్తగా అనేక సౌకర్యాలు కల్పించారు.
ఆధునిక టెర్మినల్ బిల్డింగ్ : ఆరు బుకింగ్ కౌంటర్లు, ప్రత్యేక వెయిటింగ్ హాల్స్, హై క్లాస్ వెయిటింగ్ ఏరియా, ఎగ్జిక్యూటివ్ లాంజ్ ఉన్నాయి. మొదటి అంతస్తులో ఫలహారశాల, రెస్టారెంట్. విశ్రాంతి గదులు ఉన్నాయి.
మెరుగైన ప్రయాణీకుల సౌకర్యాలు : ఏడు లిఫ్టులతో తొమ్మిది ప్లాట్‌ఫారమ్‌లు, ప్రయాణీకుల రాకపోకల కోసం ఆరు ఎస్కలేటర్‌లు , రెండు విశాలమైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు (12మీ, 6మీ వెడల్పు), అత్యంత ఆకర్షనీయంగా స్టేషన్ ముందుబాగాన్ని తీర్చిర్చదిద్దారు.
పార్కింగ్, యాక్సెసిబిలిటీ : ప్రత్యేక బస్ బేతో పాటు నాలుగు చక్రాల వాహనాలు, మూడు చక్రాల వాహనాలు, ద్విచక్ర వాహనాల కోసం విశాలమైన పార్కింగ్.
విస్తరించిన ప్లాట్‌ఫాంలు
స్టేషన్ పునరభివృద్ధిలో భాగంగా నాలుగు కొత్త ఉన్నత-స్థాయి ప్లాట్‌ఫారమ్‌లు, పూర్తి-నిడివి గల రైళ్లను నిలపడానికి ఇప్పటికే ఉన్న ఐదు ప్లాట్‌ఫారమ్‌లను పొడిగించారు. అదనంగా పది అదనపు లైన్లు కలిసి మొత్తం సామర్థ్యం 19 లైన్లకు పెరిగింది దీని వలన స్టేషన్ అదనపు 15 జతల రైలు సర్వీసులను నిర్వహించవచ్చు.
భద్రత, కనెక్టివిటీ
- స్టేషన్‌లో అధునాతన భద్రత, కనెక్టివిటీ చర్యలు తీసుకున్నారు.
- CCTV నిఘా : మెరుగైన భద్రత కోసం రౌండ్-ది-క్లాక్ పర్యవేక్షణ.
- పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్ : అన్ని ప్లాట్‌ఫారమ్‌ల కోసం.
- డిజిటల్ డిస్‌ప్లేలు : కోచ్ ఇండికేషన్ బోర్డులు, రైలు సూచన బోర్డులు “ట్రైన్స్ ఎట్ ఎ గ్లాన్స్” బోర్డులు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..