Rajnath Singh : భారతదేశంలో సైనిక శిక్షణ సంస్థల పనితీరు ప్రశంసనీయమని రక్షణ శాఖ మంత్రి (Defence Minister ) రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మధ్యప్రదేశ్‌లోని మౌలో ఉన్న ఆర్మీ వార్ కాలేజ్ (AWC), ఇన్ఫెంట్రీ స్కూల్, మిలిటరీ కాలేజ్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇంజినీరింగ్ (MCTE)ను ఈ రోజు ఆయన సందర్శించారు. జాతీయ భద్రత, సాంకేతిక అభివృద్ధికి ఈ సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయమని రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) కొనియాడారు.
వ్యూహాలు, నైపుణ్యాల కృషిపై..
సైనిక వ్యూహాలకు పదును పట్టడం, యుద్ధ నైపుణ్యాలను మెరుగుపర్చడం, సైనిక సామర్థ్యాలను పెంచడంలో శిక్షణ సంస్థలు విశేష కృషి చేస్తున్నాయని రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు. భారత సైన్యం వ్యూహాత్మక సిద్ధత, పోరాట సామర్థ్యాలను పెంచడానికి ఇవి ఎంతగానో దోహదపడుతున్నాయని అన్నారు.
సాంకేతికతపై Rajnath Singh ఏమన్నారంటే…
సైనిక సంస్థల్లో ఆపరేషనల్ మెరుగుదల కోసం ఆధునిక సాంకేతికతలను అనుసంధానించే ప్రయత్నాలను రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. అడ్వాన్స్‌డ్ ఇన్క్యుబేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్‌ను ఆయన సందర్శించారు. సైనిక కార్యకలాపాల్లో అత్యాధునిక సాంకేతికతలను అనుసంధానించే ఉద్దేశంతో రూపొందించిన అనేక అవగాహన ఒప్పందాలపై (MoUs) సమీక్ష నిర్వహించారు. ఈ అగ్రిమెంట్లు సైనిక శక్తిని పెంచే కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను తమ కార్యకలాపాల్లో అనుసంధానించేందుకు దోహదపడతాయన్నారు.
భారత సైన్యం , జాతీయ క్రీడలు
భారత సైన్యం ప్రాముఖ్యతను గుర్తిస్తూ మాట్లాడిన రాజ్‌నాథ్ సింగ్ భారత సైనిక మార్క్‌స్మన్‌షిప్ యూనిట్‌లో చేసిన అభివృద్ధిని ప్రస్తావించారు. ఈ యూనిట్ భారత జాతీయ క్రీడలపై తన ప్రభావం చూపించడాన్ని ప్రశంసించారు. జాతీయ క్రీడల స్థాయిని పెంచడంలో ఈ యూనిట్ కీలక పాత్ర పోషించిందన్నారు. అలాగే ఇన్ఫెంట్రీ మ్యూజియాన్నికూడా రాజ్‌నాథ్ సింగ్ సందర్శించారు.
జవాన్ల నిబద్ధతపై మాట్లాడుతూ..
భారతదేశ సరిహద్దులను రక్షించడంలో సైనికుల అచంచలమైన నిబద్ధతను రక్షణ మంత్రి ప్రశంసించారు. దేశ నిర్మాణంలో సాయుధ బలగాల పాత్ర అత్యంత ప్రధానమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న జియోపాలిటికల్ పరిస్థితులకు సన్నద్ధంగా ఉండడానికి, దేశభద్రత పరిరక్షణలో దేశాన్ని ఎదుగుతున్న సవాళ్లకు సిద్ధంగా ఉంచడానికి సైనికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
బీఆర్ అంబేద్కర్‌కు నివాళి
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జన్మస్థలమైన భీమ్ జన్మ భూమిని రాజ్‌నాథ్ సింగ్ సందర్శించారు. అంబేద్కర్‌కు నివాళి అర్పించిన అనంతరం మాట్లాడారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. సామాజిక సమానత్వం, ఆత్మగౌరవం కోసం అంబేద్కర్ కృషిని కొనియాడారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..