Premium coffee : కాఫీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతాకాదు. కోట్లాది మందికి ఇది ఇష్టమైన పానీయం. కాలంతోపాటు మనుషుల్లో ఆసక్తులు మారుతున్నా కాఫీపై ఉన్న ఇంట్రెస్టు చెక్కు చెదరలేదు. పైగా రోజురోజుకూ పెరుగుతోంది కూడా. ఇదే క్రమంలో ప్రీమియం కాఫీ (Premium coffee)కి బహు ఆదరణ పొందుతోంది. తద్వారా దీని వ్యాపారం వేగం పుంజుకుంది. భవిష్యత్తులో ఇంకా బాగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయట. భారతదేశంలో అవుట్ ఆఫ్ హోం కాఫీ మార్కెట్ (out-of-home coffee market ) 2028 నాటికి 2.6 నుంచి 3.2 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని ఈ రోజు వెలువడిన తాజా నివేదిక చెబుతోంది. ఈ వ్యాపారం 15-20 శాతం వార్షిక వృద్ధి రేటు (CAGR)తో అభివృద్ధి చెందుతుందని పేర్కొంది.
Premium coffee Business : వేగంగా వృద్ధి చెందుతున్న వ్యాపారం
కాఫీ మార్కెట్ 2023లో 46 శాతం వాటాతో ఉన్న ప్రీమియం కాఫీ (రూ. 200 కంటే పైగా ధర ఉన్న కాఫీ) వ్యాపార రంగం 2028 నాటికి 55-60 శాతానికి చేరుకుంటుందని, 20-25 శాతం వార్షిక వృద్ధి రేటుతో (CAGR) అభివృద్ధి చెందుతుందని నివేదిక చెబుతోంది. ఈ వృద్ధి భారతదేశంలోని అవుట్ ఆఫ్ హోం కాఫీ పరిశ్రమలో కీలకం కానుందని తెలిపింది. మాస్ మార్కెట్ 2023లో రూ. 100 కంటే తక్కువ ధర ఉన్న కాఫీ 50 శాతం వాటా కలిగి ఉంది. అయితే.. 2028 నాటికి ఈ విభాగం 30-35 శాతానికి తగ్గిపోతుందని, సాంఘిక వార్షిక వృద్ధి రేటు (CAGR) 8-10 శాతం ఉంటుందని నివేదిక అంటోంది.
ప్రీమియం కాఫీ.. జీవనశైలిలో భాగం
భారతదేశంలో అవుట్ ఆఫ్ హోం కాఫీ సంస్కృతి ఇటీవల పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతోంది. ప్రీమియం కాఫీ ఇప్పుడు జీవనశైలిగా మారింది. నగర ప్రాంతాల్లో ప్రత్యేకంగా యువతలో కాఫీ షాపులు సమాజీకరణ కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. నగర జీవితంలో వేగంగా మార్పులు, ఆర్థిక అభివృద్ధి, గ్లోబలైజేషన్ ప్రభావంతో కాఫీ షాపులు వ్యక్తిగత, వృత్తిపరమైన సమావేశాలకు నిలయాలుగా మారాయి. కాఫీ వ్యాపార సంస్థలు కళాత్మకను కనబరుస్తున్నాయి. ఓ ప్రత్యేక పద్ధతిలో తయారు చేసి వినియోగదారులకు అందిస్తున్నాయి. రూ. 200 పైగా ఖరీదుతో లభించే ఈ ప్రీమియం కాఫీ మార్కెట్‌లో కీలక పాత్ర పోషిస్తోంది.
మార్కెట్‌లో కొత్త అధ్యాయం
మాస్ మార్కెట్ విభాగం రూ. 100 కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉండి ఇప్పటికీ ప్రజాదరణ పొందుతున్నా మధ్యధర విభాగం (రూ. 100-200) వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ విభాగం ప్రత్యేకమైన కాఫీ రుచులు , అనుభవాలను అందిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఈ మార్కెట్ వృద్ధి భారత్ పానీయ రంగంలో ఒక కొత్త అధ్యాయాన్ని తెరుస్తోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








