Sarkar Live

Green energy 2025 | భారత్ లో గ్రీన్ ఎన‌ర్జీ.. 2025లో 214 గిగావాట్ల సామర్థ్యం

Green energy 2025 : భారతదేశంలో గ్రీన్ ఎన‌ర్జీ ప్రాధాన్యం రోజురోజుకూ పెరుగుతోంది. 2024 సెప్టెంబరు నాటికి మొత్తం 200 GW పునరుత్పాదక శక్తి (renewable energy) సామర్థ్యాన్ని ఇది అధిగమించింది. 2025 ప్రారంభానికి 214 GW సామర్థ్యానికి చేరుకుంది. 2030

Green energy 2025

Green energy 2025 : భారతదేశంలో గ్రీన్ ఎన‌ర్జీ ప్రాధాన్యం రోజురోజుకూ పెరుగుతోంది. 2024 సెప్టెంబరు నాటికి మొత్తం 200 GW పునరుత్పాదక శక్తి (renewable energy) సామర్థ్యాన్ని ఇది అధిగమించింది. 2025 ప్రారంభానికి 214 GW సామర్థ్యానికి చేరుకుంది. 2030 నాటికి 500 GW నాన్ నాసిల్ ఫ్యూయల్ ఎనర్జీ లక్ష్యాన్ని చేరుకోనుంద‌ని అంచ‌నా. గ్రీన్ ఎన‌ర్జీ పున‌రుత్పాద‌క శ‌క్తినిపెంచేందుకు భార‌త‌దేశం ముంద‌డుగు వేస్తోంద‌ని, దీంతో ఈ రంగంలో దినదినాభివృద్ధి చెందుతున్నామ‌ని కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది,

Green energy 2024లో సాధించిన విజయాలు

గతేడాది ఏప్రిల్ నుంచి నవంబ‌రు వరకు భారతదేశం 15 GW పునరుత్పాదక శక్తిని జోడించింది. 2023 అదే కాలంలో 7.57 GW జోడించగా ఇది రెండింతలు పెరిగింది. 2024లో సౌర శక్తి (solar energy) సామర్థ్యం 94.17 GWకు, వాయు శక్తి సామర్థ్యం 47.96 GWకు చేరుకుంది. నవంబరు 2024 నాటికి మొత్తం సౌర ప్రాజెక్టుల సామర్థ్యం 261.15 GWగా ఉంది.

  • పీఎం సూర్య ఘర్.. మఫ్ట్ బిజ్లీ యోజన : 2024 ఫిబ్రవరిలో ప్రారంభించిన ఈ పథకం 10 నెలలలో 7 లక్షల ఇన్‌స్టాలేష‌న్లు పూర్తి చేసింది. నెలకు సగటున 70,000 ఇన్‌స్టాలేష‌న్లు జరిగాయి. కోటి ఇళ్లకు రూఫ్‌టాప్ సౌర ప్యానెల్స్ అమర్చడం, నెలకు 300 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించడం లక్ష్యంగా రూ. 75,021 కోట్ల నిధులతో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇళ్లకు రూ. 30 వేల నుంచి రూ. 78 వేల వ‌ర‌కు సబ్సిడీలు అందిస్తున్నారు.
  • గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, ఉత్తరప్రదేశ్ ప్రగతి : ఈ రాష్ట్రాలు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల అమలులో అద్భుత ప్రగతి సాధించాయి. నెట్ మీటర్ యోచన, సౌకర్యాల కోసం రూ. 4,950 కోట్ల ప్రోత్సాహక పథకాన్ని శక్తి మంత్రిత్వ శాఖ ప్రారంభించింది.
  • పీఎం కుసుమ్ పథకం : దీని కింద 2.95 లక్షల సోలార్ వాటర్ పంపులు అమర్చారు. 10,000 MW డిసెంట్రలైజ్డ్ సోలార్ ప్లాంట్ల కోసం రైతులకు సహాయం అందించారు. 35 లక్షల వ్యవసాయ పంపులను సోలరైజ్ చేయడంతోపాటు 2024 జనవరి నుంచి నవంబరు వరకు 11.34 GW సోలార్ శక్తి సామర్థ్యాన్ని జోడించారు.
  • వాయు శక్తి ప్రగతి : 2024 నవంబరు నాటికి భారతదేశం మొత్తం 47.96 GW వాయుశక్తి సామర్థ్యాన్ని చేరుకుంది. ప్రస్తుత ప్రాజెక్టులతో కలిపి మొత్తం సామర్థ్యం 74.44 GWకు చేరుకుంది. గుజరాత్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు వాయు శక్తి సామర్థ్య జోడింపులో ముందంజలో ఉన్నాయి.
  • నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ : రూ. 19,744 కోట్ల నిధులతో ప్రారంభమైన ఈ మిషన్ భారతదేశాన్ని గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకుంది.
  • మంత్రివర్యుల అభిప్రాయం : 2024లో భారతదేశం పునరుత్పాదక శక్తి చారిత్రాత్మక ఘట్టాన్ని చేరుకుంది. 2030 నాటికి 500 GW లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇది గట్టి నిశ్చయాన్ని సూచిస్తుంద‌ని పునరుత్పాదక శక్తి మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. భారతదేశం 2025లోకి గ్రీన్ ఎనర్జీ సామర్థ్యంలో ప్రపంచవ్యాప్తంగా విశిష్ట స్థానం కలిగి అడుగుపెట్టిందని పేర్కొన్నారు.
See also  Parliament winter session | పార్ల‌మెంట్‌ ఉభయ సభలు బుధవారానికి వాయిదా

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

తాజా వార్తలు

Categories

నేషనల్ న్యూస్

Chhattisgarh : భారీ ఎన్‌కౌంట‌ర్‌.. 20 మంది మావోయిస్టులు హతం!

Chhattisgarh : భారీ ఎన్‌కౌంట‌ర్‌.. 20 మంది మావోయిస్టులు హతం!

PrayagRaj : మహా కుంభామేళా.. ల‌క్ష‌ల కొలువుల జాత‌ర

PrayagRaj : మహా కుంభామేళా.. ల‌క్ష‌ల కొలువుల జాత‌ర

Amit Shah AP Tour : ఏపీ పర్యటనలో అమిత్ షా.. బిగ్ అప్‌డేట్‌

Amit Shah AP Tour : ఏపీ పర్యటనలో అమిత్ షా.. బిగ్ అప్‌డేట్‌

Union Budget 2025 : 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

Union Budget 2025 : 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

Fast Track Immigration : హైదరాబాద్ విమానాశ్రయంలో ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్

Fast Track Immigration : హైదరాబాద్ విమానాశ్రయంలో ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్

Investments in Hyderabad : హైదరాబాద్‌లో క్యాపిటాల్యాండ్ రూ.450 కోట్ల పెట్టుబడి

Investments in Hyderabad : హైదరాబాద్‌లో క్యాపిటాల్యాండ్ రూ.450 కోట్ల పెట్టుబడి

Investments in Hyderabad : సింగపూర్‌ కు చెందిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ కంపెనీ క్యాపిటాల్యాండ్ గ్రూప్…
Indian Economic Survey : భార‌త్‌లో అతివేగంగా ఆర్థిక వృద్ధి.. తాజా నివేదిక‌

Indian Economic Survey : భార‌త్‌లో అతివేగంగా ఆర్థిక వృద్ధి.. తాజా నివేదిక‌

Indian Economic Survey : ప్రపంచంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా భార‌త్‌ అవ‌త‌రించ‌నుందని యునైటెడ్ నేషన్స్…
Bank Holiday 2025 : కొత్త సంవత్సరంలో బ్యాంకుల సెలవుల జాబితా ఇదే..

Bank Holiday 2025 : కొత్త సంవత్సరంలో బ్యాంకుల సెలవుల జాబితా ఇదే..

Bank Holiday 2025 : దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం,తోపాటు బ్యాంకులు అనేక కొత్త పద్ధతులను ప్రవేశపెడుతున్నాయి. అయితే…
Ballo Village | నో లిక్క‌ర్‌, నో డీజే.. ఓన్లీ జోష్.. అక్క‌డ‌ అన్నీ ఆద‌ర్శ వివాహాలే..

Ballo Village | నో లిక్క‌ర్‌, నో డీజే.. ఓన్లీ జోష్.. అక్క‌డ‌ అన్నీ ఆద‌ర్శ వివాహాలే..

Ballo Village | అది ఒక‌ ఆద‌ర్శ గ్రామం. ఆ పంచాయ‌తీ తీసుకొనే నిర్ణ‌యాలు వినూత్నం.. స్ఫూర్తిదాయకం. అక్క‌డి ప్ర‌జ‌లందరిదీ…
error: Content is protected !!