హైడ్రా అంటే.. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA). ఈ పేరు వినని వారు ఉండరు. దీని కార్యకలాపాలు, సంచలన నిర్ణయాలు, కఠిన చర్యలు కొన్ని నెలలుగా చర్చనీయాంశమయ్యాయి. హైదరాబాద్‌లోని ఆక్రమణలపై తనదైన శైలిలో ఇప్పటికే కఠిన చర్యలు తీసుకుంటున్న HYDRAA మరింత సమర్థంగా పని చేయడానికి మరిన్ని అడుగులు ముందుకేస్తోంది.
ఆక్రమణలపై HYDRAA ఉక్కుపాదం
హైదరాబాద్ లోని ప్రాధాన ప్రభుత్వ సంస్థల్లో హైడ్రా అత్యంత కీలకమైనది. నగరంలోని ప్రకృతి వనరులను, నీటి వనరులను, పార్కులను, పబ్లిక్ ఓపెన్ ప్లేసులు, ప్రభుత్వ భూములు, నాళాలను సంరక్షించేందుకు ఏర్పాటు చేసిన సంస్థ హైడ్రా చెరువులు, సరస్సులు, నదులు, ఇతర నీటి వనరులను, పార్కులు, ప్రజలకు అవసరమైన ఖాళీ ప్రదేశాలను ఆక్రమణల నుంచి రక్షించడం, అనధికార నిర్మాణాలు, ఆక్రమణలను గుర్తించి వాటిని తొలగించడం ముఖ్యోద్దేశం. ప్రకృతి వనరుల పరిరక్షణ ద్వారా పర్యావరణాన్ని సమతుల్యంగా ఉంచడానికి ఈ హైడ్రా కృషి చేస్తోంది. హైదరాబాద్‌లోని నగరంలోని ఔటర్ రింగ్ రోడ్ (ORR) వరకు HYDRAA పని చేస్తోంది.
ఉద్యోగ నియామకాలతో మరింత ముందుకు ..
తన కార్యకలాపాలను మరింత విస్తరించుకొనేందుకు HYDRAA కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ నియమకాల ద్వారా పటిష్టం చేసుకోనుంది. ఇందులో భాగంగా 970 కాంట్రాక్ట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. 203 మేనేజర్లు, 767 అసిస్టెంట్లను ఒక సంవత్సర కాలపరిమితిపై ఔట్‌సోర్సింగ్ పద్ధతిన నియమించుకోనుంది.
బాధ్యతలు ఏముంటాయంటే..
- నీటి వనరులు, పార్కులు, లేఅవుట్లలోని ఓపెన్ ప్లేసులు, ప్రభుత్వ భూములు, ఔటర్ రింగ్ రోడ్ (ORR) వరకు ఉన్న నాళాలను రక్షించడం.
- అనధికార నిర్మాణాలు, ఆక్రమణలను గుర్తించడం.
- పాదచార మార్గాలు, చెరువులు, సరస్సులు, పార్కులు తదితర ప్రదేశాల్లో ఆక్రమణలను తొలగించడం.
జీతం ఎంతంటే..
- మేనేజర్లకు నెలకు రూ. 22,750
- అసిస్టెంట్లకు నెలకు రూ.19,500
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
One thought on “HYDRAA | హైడ్రాలో కొలువులు.. 970 పోస్టులు”