గత సంవత్సరం బాక్సాఫీస్ ని బద్దలు కొట్టిన సినిమా పుష్ప -2 (Pushpa-2 ) . ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) మాస్ యాక్షన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandhana) హోమ్లి పర్ఫామెన్స్ , సుకుమార్ (Sukumar) సూపర్ టేకింగ్ , రాక్ స్టార్ డీ ఎస్పీ (DSP)మ్యూజిక్ సినిమాను ఇండియన్ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిపింది.
దాదాపు 1800 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బాహుబలి 2 (Bahubali-2) పేరిట ఉన్న రికార్డును తుడిచిపెట్టింది. దంగల్ (Dangal) 2000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి నెంబర్ వన్ లో ఉండగా.. బాహుబలి 2 ఆ తర్వాత స్థానంలో ఉంది. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేసే దిశగా దూసుకెళ్తోంది.
హిందీలో 800 కోట్లకు పైగా వసూళ్లను సాధించి హిందీ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లను సాధించిన మూవీగా కూడా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటికీ కూడా అక్కడ ఆడియన్స్ ఈ మూవీని ఎగబడి చూస్తున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను సుకుమార్ టేకింగ్ మీద నమ్మకంతో భారీ బడ్జెట్ పెట్టి ఎక్కడ రాజీ పడకుండా రెండు పార్టులుగా తెరకెక్కించారు. పుష్ప-1 ఎంత ఘనవిజయం సాధించిందో మనకు తెలిసిందే. ఆ మూవీకి గాను హీరో అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు కూడా వరించింది.
మూడు గంటలకు పైగా నిడివితో ఈ మూవీని మేకర్స్ రిలీజ్ చేశారు. నిడివి పట్టించుకోకుండా ప్రేక్షకులు మూవీని సూపర్ సక్సెస్ చేశారు. అయితే దాదాపు నెలరోజుల తర్వాత విజయవంతంగా ఆడుతున్న ఈ మూవీకి అదనంగా ఇంకో 20 నిమిషాలు పెంచి ప్రదర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
Pushpa-2 లో అదనంగా 20 నిమిషాల సీన్స్..
ఈనెల 11 నుంచి ఈ 20 నిమిషాల సీన్స్ ని జత చేస్తామని మూవీ టీమ్ ప్రకటించింది. ఈ రీ లోడేడ్ వర్షన్ వస్తుందని తెలిసి ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. అయితే ఈ నెల 10న రిలీజ్ అవుతున్న గేమ్ చేంజర్ మూవీకి ఈ రీ లోడేడ్ వెర్షన్ ఎఫెక్ట్ అవుతుందనే టాక్ వినబడుతోంది. ఎందుకంటే గేమ్ చెంజర్ మూవీకి సౌత్ లో తప్ప నార్త్ లో పెద్ద బజ్ లేదు. ఇదిలా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో వచ్చిన పుష్ప-2 లో పహా ద్ ఫాజిల్, సునీల్, అనసూయ ముఖ్య పాత్రలో నటించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..