Tirumala Stampede : తిరుమలలో వేంకటేశ్వరస్వామిని వైకుంఠద్వార దర్శనం చేసుకునేందుకు టోకెన్ల కోసం భక్తులు పోటెత్తారు. క్యూ లైన్లు రద్దీగా మారడంతో పద్మావతిపురం టోకెన్ల జారీ కేంద్రం దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈఘటనలో మల్లిక అనే మహిళా భక్తురాలితో పాటు మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని రుయా ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన భక్తురాలు సేలంకు చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు.
Tirumala Stampede : దర్శనం కోసం వచ్చి..
వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు కోసం తిరుపతిలో పలుచోట్ల టికెట్ల కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు ఉదయం నుంచి నిరీక్షిస్తున్నారు. అయితే బైరాగి పట్టిడ పార్కు వద్ద క్యూలోకి భక్తులను అనుమతించిన వెంటనే భక్తుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో కొందరు అస్వస్థతకు గురయ్యారు. శ్రీనివాసం వద్ద తొక్కిసలాట జరిగగా అక్కడ మల్లిక అనే మహిళతో పాటు మరో ముగ్గురు మృత్యువాత పడ్డారు. తొక్కిసలాటలో చనిపోయిన భక్తుల బంధువులు, గాయపడిన వారి కుటుంబ సభ్యులు హాస్పిటల్ వద్ద ఆందోళనకు దిగారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) జనవరి 10న పవిత్రమైన వైకుంఠ ఏకాదశికి టోకెన్ల పంపిణీ కోసం అలిపిరి, శ్రీనివాసపురం మరియు ఇతర ప్రాంతాలలో తొమ్మిది కేంద్రాలలో 94 కౌంటర్లను తెరిచింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..