Demolitions in Hyderabad | గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా తరహా కూల్చివేతలు జరుగుతున్నాయి. కోట్ల రూపాయల విలువ చేసే దేవాదాయ శాఖ (Endowment Department) భూములు అక్రమణకు గురి కాగా, హైకోర్టు ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ (Rajendranagar)లో కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతోంది. నాలుగు ఎకరాలలో వెలసిన అక్రమ నిర్మాణాల (Illegal Constructions) కూల్చివేతలు చేపడుతున్నారు. . అనంత పద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించిన భూములు అక్రమణకు గురైనట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు నిర్ధారించారు.
భారీగా పోలీసు బందోబస్తు
రూ.400 కోట్లు విలువైన దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములను ఆక్రమించినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో హైడ్రా అధికారులు దృష్టి సారించారు. కబ్జాదారులకు పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఎవరూ స్పందించలేదు. దీంతో ఎట్టకేలకు రంగంలోకి దిగిన అధికారులు పొక్లెయిన్‌తో అక్రమంగా వెలసిన షెడ్డులను ఒక్కొక్కటిగా నేలమట్టం చేస్తున్నారు. 4 ఎకరాల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు వెలిశాయి. దేవదాయ శాఖ రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ శేఖర్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపడుతున్నారు. దీంతో స్థానికులకు, అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. హైకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్న సమయంలో కూల్చివేతలు ఎలా చేపడతారంటూ బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ అధికారుల బృందం అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు.
Demolitions in Rajendranagar : పలుమార్లు నోటీసులు
కాగా కబ్జా అయిన అనంత పద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించిన భూమిగా అధికారులు గుర్తించారు. పలుమార్లు నోటీసులిచ్చినా వారు స్పందించకపోవడంతో హైడ్రా అధికారులు కూల్చివేతలు మొదలుపెట్టారు. . అత్తాపూర్‌లో భారీగా ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. దేవదాయశాఖ భూముల్లో వెలసిన కమర్షియల్ షెడ్లు తొలగిస్తున్నారు. దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో ఈ కూల్చివేతలు చేపడుతున్నారు. ఇప్పటివరకు మొత్తం 50కి పైగా వ్యాపార సముదాయాలు తొలగించారు. ఈ క్రమంలో స్థానికులకు అధికారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
One thought on “Demolitions : రాజేంద్ర నగర్ లో మళ్లీ హైడ్రా కూల్చివేతలు”