Lion Viral Video : మనకు పులిగానీ, సింహం (Lion) గానీ ఎదురుపడితే గుండెలు ఆగిపోయిన పనవుతుంది.. కనీసం పాము కనిపించినా ప్రాణాలు అరచేతిలోపెట్టుకొని పరుగులు పెడతాం.. కానీ గుజరాత్‌లో ఇటీవలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అటవీశాఖ అధికారి (Forest Department Guard) తనకు ఎదురుపడిన సింహానికి ఏమాత్రం భయపడకుండా ఓ పిల్లిని తరిమినట్లు తరిమాడు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్‌మీడియాలో హల్ చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే..
గుజరాత్(Gujarat )లోని భావ్‌నగర్‌లో రైల్వే ట్రాక్ దాటుతున్న సింహాన్ని అటవీ శాఖ గార్డు చూశాడు. కానీ అతడు ఏమాత్రం భయపడకుండా ఓ కర్రతో సింహాన్ని వెంబడించడం ప్రారంభించాడు. అది కూడా వెంటనే రైలు పట్టాలు దాటి పారిపోయింది. ఇది లిలియా స్టేషన్ సమీపంలో వీడియో తీశారు. వీడియోలో, సింహం ట్రాక్‌ను దాటడం, తరువాత ముందుకు వెళుతున్నట్లు చూడవచ్చు.
ఎన్‌డిటివి కథనం ప్రకారం, జనవరి 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో లిల్యా రైల్వే స్టేషన్‌లోని గేట్ నంబర్ LC-31 వద్ద ఈ సంఘటన జరిగిందని రైల్వే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శంభుజీ తెలిపారు.
Viral Video పై నెటిజన్ల నుంచి ప్రశంసలు
శీతాకాలంలో, గుజరాత్‌లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో, అటవీ శాఖ ఉద్యోగులు అప్రమత్తంగా ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో సింహాలకు రక్షణ కల్పిస్తారు. రైల్వే శాఖ కూడా ఇదే విషయమై అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే, సాహసోపేతమైన అటవీ శాఖ ఉద్యోగి ధైర్యం, అప్రమత్తతకు నెటిజన్ల నుండి ప్రశంసలు అందుతున్నాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.