Indian Economic Survey : ప్రపంచంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుందని యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ ఎకనామిక్ మానిటరింగ్ చీఫ్ హమీద్ రషీద్ తెలిపారు. 6.6 శాతం ప్రణాళికాబద్ధమైన వార్షిక వృద్ధి రేటుతో మరోసారి దూసుకెళ్లనుందని పేర్కొన్నారు. వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ 2025 (WESP) అనే యునైటెడ్ నేషన్స్ ప్రతిష్టాత్మక నివేదికను విడుదల చేసిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ నివేదిక ప్రకారం 2025లో భారత జీడీపీ మరింత వేగంగా 6.8 శాతం వృద్ధి చెందుతుందని అంచనా.
భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే అంశాలు
భారతదేశం గురించి WESP నివేదిక కొన్ని ముఖ్యమైన అంశాలను వెల్లడించింది. అవేమిటంటే..
- ఎగుమతుల రంగం: ఔషధాలు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల లాంటి కీలక రంగాల్లో ఎగుమతుల వృద్ధి భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి దోహదపడుతుందని WESP నివేదిక తెలిపింది.
- వ్యక్తిగత వినియోగాలు, పెట్టుబడులు : భారతదేశ ప్రజల వ్యక్తిగత వినియోగాలు, ప్రైవేటు పెట్టుబడులు భారతదేశ ఆర్థిక వృద్ధిని పెంచుతాయని WESP వివరించింది. మౌలిక వసతుల అభివృద్ధిపై పెట్టుబడులు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని పేర్కొంది. ఇది ఒక బహుళ ప్రభావాలను సృష్టిస్తాయని వివరించింది.
- మేనిఫెక్చరింగ్, సేవలు: భారత తయారీ (మేనిఫెక్చరింగ్), సేవల రంగాలు విస్తరిస్తుండటం భారతదేశ ఆర్థిక వ్యవస్థను మరింత ముందుకు నడిపిస్తుందని నివేదిక WESP స్పష్టం చేసింది.
- వ్యవసాయం: వ్యవసాయ రంగానికి సంబంధించిన కొన్ని అంశాలు భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని WESP తన నివేదికలో పేర్కొంది. 2024లో కురిసిన వర్షాలు వేసవి పంటల దిగుబడిని పెంచాయని, దీని వల్ల 2025కు వ్యవసాయ ఉత్పత్తి అంచనాలు కూడా పెరిగాయని వివరించింది. ఇది వ్యవసాయ రంగాన్ని భారత ఆర్థిక వ్యవస్థకు మరింత బలంగా నిలిచేలా చేస్తోందని తెలిపింది.
ప్రపంచ స్థాయిలో భారత స్థానం
గత ఏడాది 6.8 శాతం వృద్ధి రేటుతో పోలిస్తే ఈ సంవత్సరం వృద్ధి రేటు కొద్దిగా 6.6 శాతానికి తగ్గినప్పటికీ ప్రపంచ ఆర్థిక మందగమనం నేపథ్యంలో కూడా భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా తన స్థానాన్ని నిలుపుకుంది.
ప్రపంచ వృద్ధి రేట్లు
సమగ్ర ప్రపంచ వృద్ధి రేటు 2.8 శాతం వద్ద నిలిచింది. కానీ అభివృద్ధి చెందిన దేశాల వృద్ధి రేటు 0.1 శాతం తగ్గి 1.6 శాతానికి చేరుకుంది.
చైనా వృద్ధి రేటు తగ్గుదల
ప్రపంచంలో రెండొ అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అయిన చైనాలో వృద్ధి రేటు 2024లో 4.8 శాతానికి తగ్గింది. 2025లో ఇది మరింతగా తగ్గి 4.5 శాతానికి చేరుతుందని అంచనా.
భారత ఆర్థిక రంగం.. భవిష్యత్తు
- బలమైన ఎగుమతుల వృద్ధి: సేవల రంగం, ఔషధాలు, ఎలక్ట్రానిక్స్ వంటి విభాగాల్లో గణనీయమైన వృద్ధి.
- వ్యక్తిగత వినియోగం, పెట్టుబడులు : వీటి ప్రభావంతో దేశీయ ఆర్థిక వ్యవస్థ మరింత స్థిరంగా ఉంటుంది.
- మౌలిక వసతులపై పెట్టుబడులు: వీటి వల్ల సకల రంగాల్లో అభివృద్ధి చెందే అవకాశాలు మెరుగవుతాయి.
- వ్యవసాయం : అనుకూల వాతావరణ పరిస్థితులు భారత వ్యవసాయ రంగానికి మద్దతు అందిస్తాయి.
Indian Economic Survey : భారతదేశంలో గణనీయ వృద్ధి
మొత్తమ్మీద భారతదేశం 2025లో కూడా ఆర్థిక వృద్ధిలో ప్రముఖ దేశంగానే నిలుస్తుందని నివేదికలు చెబుతున్నాయి. తయారీ రంగం, సేవలు, వ్యవసాయ రంగంలో గణనీయమైన అభివృద్ధి, మౌలిక వసతులపై పెట్టుబడులు భారతదేశాన్ని మరింతగా ముందుకు నడిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా తన స్థానాన్ని కొనసాగిస్తోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..