Special Shows : ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన గేమ్ చేంజర్ (Game Changer)మూవీ మొదటి రోజు మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. శంకర్ (Shankar ) డైరెక్షన్ మార్క్ ఉన్నా మునుపటిలా టేకింగ్ లేదని విమర్శ లు కూడా వస్తున్నాయి. కానీ తన గత చిత్రం భారతీయుడు-2 (Bharatheeyudu-2) సినిమా కంటే ఈ మూవీ బెటర్ అనేవారు కూడా ఉన్నారు.
దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీని తీశారు. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా దాదాపు 90 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టిందని తెలుస్తోంది. కానీ మొదటిరోజు 186 కోట్ల కలెక్షన్స్ రాబట్టిందని చిత్ర బృందం రిలీజ్ చేసిన ఒక పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన ప్రేక్షకులు ఫేక్ పోస్టర్ అని తేల్చేస్తున్నారు. ఈ స్థాయిలో కలెక్షన్స్ రావడం ఇంపాజిబుల్ అంటున్నారు.
Special Shows పై తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం
ఇది పక్కన పెడితే మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా ఈ మూవీకి పోటీగా ఏ సినిమా లేకపోవడం వల్ల రెండవ రోజు కూడా అదే జోరు కొనసాగించింది. శనివారం రోజు కలెక్షన్స్ కూడా రిలీజ్ అయిన రోజు కలెక్షన్స్ లాగే ఉండడం, రేపు వీకెండ్ కావడంతో కలెక్షన్స్ తగ్గకుండా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. కానీ తెలంగాణ గవర్నమెంట్ మార్నింగ్ స్పెషల్ షో రద్దు (Special shows cancelled) చేయడం కలెక్షన్ల పరంగా కొద్దిగా దెబ్బ పడే చాన్స్ ఉంది.
ఈ మూవీ చూసిన కొందరి ప్రేక్షకుల నుంచి మొదటి షో నుంచే ఫ్లాప్ టాక్ వచ్చింది. కానీ మూవీ బాలేదన్న వారే రామ్ చరణ్ పోషించిన అప్పన్న క్యారెక్టర్ అదిరిపోయిందని అనే టాక్ కూడా వెల్లింది. పర్టిక్యులర్ గా ఆ క్యారెక్టర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో రామ్ చరణ్ యాక్టింగ్ చూడాలని థియేటర్లకు వచ్చేవారు కూడా ఉండడం ఈ మూవీకి కలిసొచ్చిన అంశంగా చెప్పొచ్చు. దీంతో కలెక్షన్స్ రెండో రోజు కూడా ఆ రేంజ్ లోనే ఉన్నాయి.ఆ పర్ఫామెన్స్ కు ఇంకా రన్ లో కలెక్షన్స్ పెరుగొచ్చు.
బాలీవుడ్ లో ఈ మూవీ మొదటి రోజు కంటే రెండో రోజు పుంజుకున్నట్లు తెలుస్తోంది. మొదటి రెండు రోజులు 20 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఇదే జోరు మరో 10 రోజులు కొనసాగిస్తే బాలీవుడ్లో మంచి కలెక్షన్స్ రాబట్టిన మూవీగా నిలుస్తుంది. టాలీవుడ్ లో రాబోయే కొత్త సినిమాలతో ఈ మూవీకి కలెక్షన్లు తగ్గినా కూడా బాలీవుడ్లో ఈ జోరు కొనసాగిన చాలు.
Special shows in Telangana : మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా శంకర్ సినిమాలో తమిళంలో ఏ రేంజ్ లో కలెక్షన్స్ ఉంటాయో మనకు తెలుసు. అక్కడ స్ట్రెయిట్ గా వచ్చే తమిళ్ సినిమాలు లేవు కాబట్టి ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు కూడా అక్కడ రిలీజ్ అయినా కూడా ఈ మూవీకి పెద్దగా నష్టం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ రెండు సినిమాల కంటే శంకర్ సినిమాకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉండకపోవచ్చు.
ఆ ఓటీటీతో ఒప్పందం
400 కోట్లకు పైగా బడ్జెట్తో నిర్మించిన సినిమా కాబట్టి ఈ రెండు రోజుల్లో 100 కోట్ల షేర్ సాధించింది అనుకున్న కూడా ఈ మూవీ బయటపడాలంటే మరో 300 కోట్లు షేర్ రాబట్టాల్సి ఉంది. అంటే మొత్తం మీద ఇంకా 600 కోట్ల గ్రాస్ రాబట్టాల్సీ ఉంటుంది. అయితే ఈ మూవీ డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ సంస్థ 140 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇలాగే ఇంకో వారం రోజులు మూవీ ఆడుతూ కలెక్షన్స్ రాబడితే ప్రొడ్యూసర్స్ నష్టాల నుండి బయటపడే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








