Turmeric Board : సంక్రాంతి పండుగ వేళ కేంద్రంలోని మోదీ (PM Modi) ప్రభుత్వం తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎంతో కాలంగా ఆశగా ఎదురుచూస్తున్న పసుపు బోర్డుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిజామాబాద్ కేంద్రంగా కొత్తగా పసుపు బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం (Central Government) అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా పసుపు బోర్డు ఛైర్మన్‌గా పల్లె గంగారెడ్డిని నియమించినట్లు నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ (Bandi Sanjay) చేసిన ప్రయత్నం ఫలించింది. గతంలో స్పెసెస్ బోర్డు (spices board) ఏర్పాటు చేయగా, ప్రత్యేకించి పసుపు బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. పసుపు బోర్డుతో తెలంగాణలో పసుపు రైతుల క్రయవిక్రయాలు, ప్రాసెసింగ్‌కు మరింత ప్రోత్సాహం లభించనుంది.
నిజామాబాద్ (Nizamabad) లో జాతీయ పసుపు బోర్డును ప్రారంభించనున్నారు. దీని ప్రారంభోత్సవానికి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల, వ్యవసాయ శాఖల అధికారులు, పశ్చిమ రాష్టాల్ర ఇతర వ్యవసాయ సంబంధిత నాయకులు, రాష్ట్రప్రభుత్వ ప్రతినిధులు పాల్గొననున్నట్లు సమాచారం. మరోవైపు పసుపు బోర్డు ప్రారంభించే సందర్భంగా పసుపు రైతుల కోసం నూతన ప్రాజెక్టులు, కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రోత్సాహకాలను కూడా ప్రకటించే చాన్స్ ఉంది.
రైతులకు పసుపు విక్రయాలు, మార్కెట్‌కు ఉన్న అడ్డంకులు, రుణాలు, మద్దతు ధర, ఇతర సమస్యల పరిష్కారంపై కీలక చర్చలు నిర్వహించనున్నారు .పసుపు రైతుల సమస్యలు, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు కేంద్రం ఈ బోర్డు స్థాపించడానికి సిద్దమైంది. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా నిజామాబాద్, కొమురంభీం ఇతర జిల్లాల్లో పసుపు సాగువుతోంది. ఈ బోర్డు ద్వారా పసుపు రైతులకు మరింత చేయూత అందనుంది.
Turmeric Board చైర్మన్ గా పల్లె గంగారెడ్డి
రైతు సంక్షేమం కోసం పోరాడిన ప్లలె గంగారెడ్డిని పసుపు బోర్డు చైర్మన్ (Turmeric Board Chairman) గా నియమించింది. వ్యవసాయ రంగంపై పరిజ్ఞానం, పసుపు రైతుల సమస్యల పట్ల అవగాహన, ఉన్న లింగారెడ్డికి పదవిని కట్టబెట్టారు. మార్కెట్ ప్రవర్తన, గుణాత్మక అభివృద్ధి, మార్గదర్శకాలను ఆయన వివరించారు. కాగా పసుపు బోర్డు ఏర్పాటు ద్వారా రైతులకు అనేక అవకాశాలు రానున్నాయి. రైతులు పసుపు పంటను మరింత మంచి ధరలలో విక్రయించేందుకు మరింత సహాయాన్ని అందుకుంటారు. దీంతోపాటు పసుపు ప్రాసెసింగ్, ఎగుమతుల ప్రోత్సాహం, నూతన టెక్నాలజీలను ఉపయోగించి పంటల ఉత్పత్తి పెంచడం వంటి అంశాలపై రైతులకు మరింత అవగాహన పెరుగుతుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..