South Central Railway : తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు ప్రయాణికుల నుంచి అపూర్వ స్పందన వస్తోంది. దక్షిణ మధ్య రైల్వే (SCR) జోన్‌లో ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు విజయవంతమయ్యాయి. ప్రస్తుతం అవి నడుస్తున్న అన్ని రూట్లలో ప్రయాణికులతో నిండిపోతున్నాయి.
అన్ని వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు స్థిరంగా 100 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. హైదరాబాద్‌తో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కనెక్టివిటీ సికింద్రాబాద్ – విశాఖపట్నం, సికింద్రాబాద్ – తిరుపతి, కాచిగూడ – యశ్వంతపూర్ (బెంగళూరు), సికింద్రాబాద్ – నాగ్‌పూర్ మార్గాల్లో సేవలందిస్తున్నాయి.. వందే భారత్ ఆక్యుపెన్సీకి సంబంధించిన ఇటీవలి వివరాల ప్రకారం.. ఈ సేవలను 143 శాతం వరకు అధిక ఆదరణ పొందుతున్నట్లు తెలుస్తోంది.
సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 100 శాతం కంటే ఎక్కువ ఆక్యుపెన్సీతో స్థిరంగా నడుస్తోంది. ఆ తర్వాత 134 శాతం ఆక్యుపెన్సీ రేషియోను నమోదు చేసింది. కాగా, విశాఖపట్నం-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అత్యధికంగా 143 శాతం ఆక్యుపెన్సీ రేషియో నమోదు చేసింది.
రైల్వే అధికారుల ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరంలో సగటు ఆక్యుపెన్సీ 103 శాతంతో వందే భారత్ రైలు సేవలు బాగా పాపులర్ అయ్యాయి. ఈ సేవలు ప్రజలకు అత్యంత సౌకర్యవంతమైన, విమాన ప్రయాణం వంటి అనుభవాన్ని అందిస్తాయి. ఇది వారి జనాదరణకు ప్రధాన కారణాలలో ఒకటి అని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే ప్రయాణికుల్లో వందే భారత్‌కు ఉన్న ఆదరణను పరిగణనలోకి తీసుకుని వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
South Central Railway జోన్‌లో నడుస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు:
- సికింద్రాబాద్ – విశాఖపట్నం
- సికింద్రాబాద్ – తిరుపతి
- కాచిగూడ – యశ్వంతపూర్
- సికింద్రాబాద్ – నాగ్‌పూర్
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..