Amravati : ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ అభివృద్ధికి ముందడుగు పడింది. ఒర్వకల్ మొబిలిటీ వ్యాలీ (Orvakal Mobility Valley) పేరుతో ఓ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. కర్నూలు జిల్లాలో పీపుల్ టెక్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ దీన్ని స్థాపించనుండగా చంద్రబాబు సర్కారు అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1,200 ఎకరాల విస్తీర్ణంలో రూ. 1,800 కోట్ల పెట్టుబడితో ఈ ఎలక్ట్రిక్ వెహికల్ పార్క్ (Electric vehicle park) ఏర్పాటు కానుంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పీపుల్ టెక్ ఎంటర్‌ప్రైజెస్ ఒప్పందం కుదుర్చుకుంది.
ప్రాజెక్ట్ ముఖ్యోద్దేశం ఏమిటంటే..
ఒర్వకల్ మొబిలిటీ వ్యాలీ ( Karnool Orvakal Mobility Valley) లో విద్యుత్ వాహన పరిశ్రమలకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించనున్నారు. ఈ ఈవీ ( (EV) పార్క్‌లో సాంకేతిక పరిశోధన (R&D) కేంద్రాలు, టెస్టింగ్ ల్యాబోరేటరీలు, ప్రముఖ తయారీదారుల భాగస్వామ్యాల కోసం ప్రోత్సాహక కేంద్రాలు, ప్లగ్డ్ అండ్ ప్లే పరిశ్రమల స్థలాలు, రెడీమేడ్ ప్లాట్లు తదితర సదుపాయాలను పీపుల్ టెక్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ సమకూర్చనుంది. ఈ ఒర్వకల్ మొబిలిటీ రూపకల్పన ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పటయ్యే ఎలక్ట్రిక్ వాహన (Electric vehicle) పరిశ్రమలు తక్కువ సమయంలో పెద్ద స్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించొచ్చు. విద్యుత్ వాహన పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన ఆధునిక మౌలిక వసతులు అందించడం ఈ ప్రాజెక్ట్ ముఖ్యోద్దేశం.
జాయింట్ వెంచర్ పార్టనర్‌షిప్‌తో యూనిట్లు
పీపుల్ టెక్ గ్రూప్ ఇప్పటికే తైవాన్, కొరియా, చైనా దేశాల్లోని ప్రముఖ బ్యాటరీ, మోటార్ కంట్రోల్ తయారీదారులతో చర్చలు జరుపుతోంది. వీటితో జాయింట్ వెంచర్ పార్టనర్‌షిప్‌ను కుదుర్చుకుని ఈ పార్క్‌లో యూనిట్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది.
తొలి యూనిట్‌గా ఎలక్ట్రిక్ బైక్స్ తయారీ
ఈ ప్రాజెక్ట్ ద్వారా 1.5 బిలియన్ డాలర్లు (రూ. 13,000 కోట్లు) పెట్టుబడులను ఆకర్షించొచ్చని అంచనా. అలాగే 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అధికారులు తెలిపారు. ఈ ఈవీ పార్క్‌లో ప్రాథమిక యూనిట్‌గా పీపుల్ టెక్ ఎంటర్‌ప్రైజెస్ రూ. 300 కోట్లతో ఎలక్ట్రిక్ బైక్స్‌ను తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది.
సంచలనాత్మక నిర్ణయం: మంత్రి లోకేష్
ఒర్వకల్ మొబిలిటీ వ్యాలీపై ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (IT Minister Nara Lokesh) మాట్లాడుతూ ఈ విద్యుత్ వాహన పరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా నూతన పరిశ్రమల ప్రోత్సాహానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ (Industries Minister TG Bharath) మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ ద్వారా కర్నూలు జిల్లాలో పరిశ్రమల వృద్ధి, ఆర్థిక ప్రగతి వేగవంతమవుతుందని అన్నారు. పీపుల్ టెక్ గ్రూప్ ప్రతినిధి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఒర్వకల్ మొబిలిటీ వ్యాలీకి 2025 మార్చి చివర్లో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
Orvakal Mobility Valley : ఒర్వకల్ మొబిలిటీ వ్యాలీతో ప్రయోజనాలు
ఒర్వకల్ మొబిలిటీ వ్యాలీ సాంకేతికత, పరిశ్రమల అభివృద్ధి, ఆర్థిక ప్రగతి, పర్యావరణ పరిరక్షణలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. విద్యుత్ వాహనాలు వాయు కాలుష్యాన్ని తగ్గించి, పర్యావరణానికి మేలు చేస్తాయి. అంతేకాక, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. విద్యుత్ వాహన పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్ నూతన కేంద్రంగా మారనుంది. ప్రైవేటు పెట్టుబడులు, ప్రభుత్వ మద్దతు, ఆధునిక సౌకర్యాలు ఈ రాష్ట్రాన్ని దేశవ్యాప్తంగా వినూత్నంగా నిలిపే అవకాశాలు ఉన్నాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








