Investments in Hyderabad : సింగపూర్ కు చెందిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ కంపెనీ క్యాపిటాల్యాండ్ గ్రూప్ (CapitaLand Group), హైదరాబాద్‌లో 1 మిలియన్ చదరపు అడుగుల అత్యాధునిక ఐటీ పార్క్‌ను అభివృద్ధి చేయడానికి రూ.450 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. సింగపూర్‌లో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశం అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి, ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర అధికారులు, క్యాపిట ల్యాండ్ ఇండియా ట్రస్ట్ మేనేజ్‌మెంట్ పీటీఈ సహా సీనియర్ క్యాపిటల్యాండ్ ఎగ్జిక్యూటివ్‌లు పాల్గొన్నారు. కంపెనీ CEO & ED గౌరీ శంకర్ నాగభూషణం ఆదివారం అధికారికంగా ప్రకటన విడుదల చేశారు.
కాగా తెలంగాణలో పెట్టుబడులకు క్యాపిటాల్యాండ్ గ్రూప్ ముందుకు వచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హర్షం వ్యక్తం చేశారు. ప్రముఖ వ్యాపార, సాంకేతిక హబ్‌గా హైదరాబాద్ స్థానాన్ని బలోపేతం చేయడంలో ఇది ఒక కీలక మైలురాయిగా సీఎం రేవంత్ అభివర్ణించారు. రాబోయే ప్రాజెక్ట్ హైదరాబాద్‌లోని క్యాపిటాల్యాండ్ విస్తృత అభివృద్ధి పైప్‌లైన్‌లో భాగమని, ఈ కొత్త ప్రాజెక్ట్ ప్రీమియం సౌకర్యాలను కోరుకునే గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (జిసిసి), బ్లూ-చిప్ కంపెనీల నుండి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చగలదని పేర్కొన్నారు.
కంపెనీ సీఈవో గౌరీశంకర్ నాగభూషణం మాట్లాడుతూ.. “హైదరాబాద్‌లో మా కార్యకలాపాలను విస్తరించేందుకు మేము సంతోషిస్తున్నాం, స్థిరమైన, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అందించడానికి దాని శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థను ఉపయోగించుకుంటాం.” క్యాపిటాల్యాండ్ హైదరాబాద్‌లో మూడు ప్రముఖ వ్యాపార పార్కులను నిర్వహిస్తోంది అవి- ఇంటర్నేషనల్ టెక్ పార్క్ హైదరాబాద్ (ITPH), aVance Hyderabad, CyberPearl అని వివరించారు.
CapitaLand Group Investments in Hyderabad : కాగా హైదరాబాద్‌లో క్యాపిటాల్యాండ్ గతంలో ప్రకటించిన 25 మెగావాట్ల ఐటీ లోడ్ డేటా సెంటర్ 2025 మధ్య నాటికి అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. ఇంటర్నేషనల్ టెక్ పార్క్ హైదరాబాద్ (ఐటీపీహెచ్)లో రెండో దశ రీడెవలప్‌మెంట్ ఈ సంవత్సరం ప్రారంభం కానుంది, 2028 నాటికి పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..