Sarkar Live

Firing | అమెరికాలో కాల్పులు.. తెలుగు విద్యార్థి మృతి.. ట్రంప్ ప్ర‌మాణ స్వీకారం వేళ క‌ల‌క‌లం

Firing in America : అమెరికా (United States)లో మ‌రో ఘోరం జ‌రిగింది. దుండుగుల దాడిలో మరో తెలుగు విద్యార్థి బ‌ల‌య్యాడు. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ ఈ ఘ‌ట‌న ఇవాల‌ చోటుచేసుకుంది.

Kadapa

Firing in America : అమెరికా (United States)లో మ‌రో ఘోరం జ‌రిగింది. దుండుగుల దాడిలో మరో తెలుగు విద్యార్థి బ‌ల‌య్యాడు. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ ఈ ఘ‌ట‌న ఇవాల‌ చోటుచేసుకుంది. షింగ్టన్ డిసి(Washington DC)లో భారీ బందోబస్తు ఉన్న‌ సమయంలోనే హైద‌రాబాద్‌కు చెందిన యువ‌కుడిపై దుండ‌గులు కాల్పులు జ‌రప‌డం క‌ల‌క‌లం రేపింది.

స్థిర ప‌డ‌తాడ‌ని అనుకుంటే..

హైదరాబాద్‌ చైతన్యపురి ప్రాంతానికి చెందిన కొయ్యడ చంద్రమౌళి కుమారుడు రవి తేజ 2022 మార్చిలో అమెరికా వెళ్లాడు. తన మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి, ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. తమ కొడుకు ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడతాడని తల్లి దండ్రులు ఆశించగా ఈ ఘ‌ట‌న వారిని తీవ్ర శోకాన్ని మిగిల్చింది. వాషింగ్టన్‌లో దుండగుల కాల్పుల్లో రవితేజ మృతి చెందాడ‌ని తెల‌వ‌డంతో ఆ కుటుంబ స‌భ్యుల‌తోపాటు బంధుమిత్రులు దిగ్భ్రాంతి చెందారు.

నవంబరులో ఖమ్మం యువకుడి మృతి

అమెరికాలో తెలుగు విద్యార్థుల‌పై కాల్పులు (Firing incidents in US) కొత్తేమీ కాదు. ఇలాంటి ఘ‌ట‌న‌లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గత ఏడాది నవంబరులో కూడా ఖమ్మం జిల్లాకు చెందిన సాయి తేజ అనే విద్యార్థి అమెరికాలోని చికాగోలో జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. సాయి తేజ, ఎంఎస్ చదువుతోపాటు సూపర్ మార్కెట్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్న సమయంలో దుండగులు జరిపిన కాల్పులలో మరణించాడు. దీంతో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

Firing in US : భార‌త్‌లో పెరుగుతున్న భయం

ఇలాంటి వరుస ఘటనలు అమెరికాలో ఉన్న తెలుగు ప్రజ‌ల్లో భయాందోళనలు పెంచుతున్నాయి. ఉన్నత విద్య , మంచి భవిష్యత్తు కోసం విదేశాలకు వెళ్తున్న యువత జీవితాల్లో ఈ పరిణామాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.

భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని పెరుగుతున్న డిమాండ్‌

అమెరికాలో ఇండియన్ కమ్యూనిటీపై జరుగుతున్న దాడులపై భారత ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాల‌నే డిమాండ్ స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. అక్కడి అధికారులతో చర్చలు జరిపి భారతీయుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఇక్క‌డి ప్ర‌జ‌లు కోరుతున్నారు. విదేశీ విద్యార్థులపై ఇలాంటి దాడులను ఆపటానికి అంతర్జాతీయ స్థాయిలో చట్టాలను మరింత కఠినత‌రం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ప్ర‌వాస భార‌తీయులు మ‌ద్ద‌తు

ఇలాంటి ఘోర ఘటనల త‌ర్వాత‌ అక్కడి ప్రవాస భార‌తీయులు బాధిత కుటుంబాలకు అండ‌గా నిలుస్తున్నారు. మృతదేహాలను స్వదేశానికి పంపించడం, బాధిత కుటుంబాల‌కు ఆర్థిక సాయం అందించ‌డం లాంటి చర్యలు చేప‌డుతున్నారు. అయితే.. ప్రభుత్వ మద్దతు కూడా అవ‌స‌ర‌మ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం, అంతర్జాతీయ సంఘాలు, అమెరికాలోని ప్ర‌వాస భార‌తీయులు అందరూ కలిసి ఈ సమస్యను ప‌రిష్క‌రించాల‌ని ప‌లువురు అంటున్నారు.

విద్యార్థులు సూచ‌న‌లు ఈ సూచనలు పాటించండి..

  • విద్యార్థుల భద్రతపై అవగాహన: అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులు, ముఖ్యంగా తెలుగు విద్యార్థులు, తమ భద్రతకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.
  • సమూహాల్లో ఉండటం: అపరిచిత ప్రాంతాల్లో ఒంటరిగా తిరగడం మానుకోవాలి. ఎక్కువగా సమూహాల్లో ఉండటానికి ప్రయత్నించాలి.
  • అవసరమైన లీగల్ డాక్యుమెంట్స్: ప్రతి విద్యార్థి లేదా ఉద్యోగి తమ దగ్గర అత్యవసర సందర్భాల్లో ఉపయోగపడే డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచుకోవాలి.
  • ఎంబసీతో టచ్‌లో ఉండటం: అమెరికాలో ఉండే భారత రాయబార కార్యాలయంతో కాంటాక్ట్ వివరాలు కలిగి ఉండాలి. ఇది అత్యవసర సమయాల్లో సాయం పొందేందుకు ఉపయోగపడుతుంది.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?