BHEL Recruitment 2025 : భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) ట్రైనీ ఇంజనీరింగ్, ట్రైనీ సూపర్‌వైజర్స్ (టెక్) ఉద్యోగాల నియామకానికి ఈ రోజు (జనవరి 20) షార్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థులు 2025 ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
BHEL Recruitment 2025 : ముఖ్య సమాచారం
- పోస్టు పేర్లు: ట్రైనీ ఇంజినీర్ , ట్రైనీ సూపర్‌వైజర్ (టెక్)
- మొత్తం ఖాళీలు: 400 (ట్రైనీ ఇంజినీర్- 250, ట్రైనీ సూపర్‌వైజర్ -150) ఖాళీల వివరాలు
- ట్రైనీఇంజినీర్ పోస్టులు:
మెకానికల్- 70, ఎలక్ట్రికల్- 25, సివిల్-25, ఎలక్ట్రానిక్స్- 20, కెమికల్-5, మెటలర్జీ- 5 - ట్రైనీ సూపర్‌వైజర్ పోస్టులు:
మెకానికల్-140, ఎలక్ట్రికల్- 55, సివిల్- 35, ఎలక్ట్రానిక్స్-20
- అర్హతలు: ట్రైనీ ఇంజినీర్ పోస్టుకు B.Tech/BE (వయస్సు 21-27 ఏళ్లు), ట్రైనీ సూపర్‌వైజర్‌కు డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ (వయస్సు 18-27 ఏళ్లు) అప్లికేషన్ ఫీజు
- సాధారణ/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్: రూ 795
- ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ ఎక్స్-సర్వీస్‌మెన్: రూ. 295 పరీక్షలు
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
- వ్యక్తిగత ఇంటర్వ్యూ దరఖాస్తు చేయడం ఎలా?
- BHEL అధికారిక వెబ్‌సైట్ (https://careers.bhel.in/) ను సందర్శించండి.
- Recruitment of Engineer Trainee & Supervisor Trainee (Tech) 2025 అనే లింక్‌పై క్లిక్ చేయండి.
- Apply Online అనే ఆప్షన్ ఎంచుకుని దరఖాస్తు ఫారం నింపండి.
- అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి. ఫొటో, సంతకం జతచేయండి.
- చివరిగా అప్లికేషన్ ఫీజు చెల్లించి, సబ్మిట్ చేసి ప్రింటౌట్ తీసుకోండి.
అర్హతలు
ట్రైనీ ఇంజినీర్ : AICTE గుర్తింపు పొందిన సంస్థ నుంచి B.Tech, BE, లేదా సంబంధిత కోర్సు పూర్తి చేసి ఉండాలి. 2025 జనవరి 1 నాటికి 21 నుంచి 27 సంవత్సరాల మధ్య వయోపరిమితి ఉండాలి.
ట్రైనీ సూపర్‌వైజర్ : AICTE గుర్తింపు పొందిన డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ 65% మార్కులతో (SC/ST కి 60% చాలు) పూర్తిచేసి ఉండాలి. 2025 జనవరి 1 నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయోపరిమితి కలిగి ఉండాలి.
వయో సడలింపు
- OBC-NCL: 3 సంవత్సరాలు
- SC/ST: 5 సంవత్సరాలు
- PwBD: సాధర-10 సంవత్సరాలు, OBC NCL- 13 సంవత్సరాలు, SC/ST-15 సంవత్సరాలు ఎంపిక ప్రక్రియ
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT): 2025 రెండో త్రైమాసికంలో నిర్వహించనున్నారు.
- CBT ఫలితాల విడుదల తర్వాత, అర్హత పొందిన అభ్యర్థులకు వ్యక్తిగత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అప్లికేషన్ ఫీజు
- సాధారణ/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.795 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- SC/ST/PwBD/Ex-SM అభ్యర్థులకు ఫీజు రూ 295 మాత్రమే.
- డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లేదా ఇతర ఆన్‌లైన్ గేట్‌వే ద్వారా చెల్లింపు చేయొచ్చు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..