chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి వరుస ప్రాజెక్టులను ఓకే చేస్తూ అభిమానులను థ్రిల్ చేస్తున్నారు. సెట్స్ పై విశ్వంభర మూవీ ఉండగానే శ్రీకాంత్ ఓదెల మూవీకి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ మూవీ అనౌన్స్మెంట్ రాగా మరో మూవీ అనిల్ రావిపూడి తో ఆల్మోస్ట్ ఓకే అయింది. దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. వీటితో పాటు మరో మూవీ ని కూడా లైన్లో పెట్టాడని తెలుస్తోంది.
లక్కీ భాస్కర్ తో సాలిడ్ హిట్టు కొట్టిన వెంకీ అట్లూరి(venki Atluri) డైరెక్షన్లో చిరు ఓ మూవీ చేయడానికి సిద్ధమవుతున్నాడట. లక్కీ భాస్కర్ కి ముందే వీరి కాంబోలో మూవీ రావాల్సి ఉంది. కథ చర్చల్లో భాగంగా చిరుకు సరిపడిపోయే కథ తన వద్ద లేనందున ఆ మూవీ ముందుకు జరగలేదు. ఇప్పుడు లక్కీ భాస్కర్ హిట్ తో వెంకీ అట్లూరి రేంజ్ మారిపోయింది. దీంతో మెగాస్టార్ తో మూవీ చేయడానికి ఇదే సరైన టైమ్ అని భావిస్తున్నాడట.ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్టోరీ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
డైరెక్టర్ గా ఫస్ట్ సినిమా బింబిసారతో సాలిడ్ హిట్టు కొట్టిన వశిష్టకు మెగాస్టార్ అవకాశం ఇచ్చారు. ఈయన డైరెక్షన్లో చేస్తున్న విశ్వంభర చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. ఏప్రిల్ లో రిలీజ్ అవుతున్న ఈ మూవీపై మెగా అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. వాల్తేరు వీరయ్యతో మెగాస్టార్ తన స్టామినా చూపించారు. డైరెక్టర్ బాబి వింటేజ్ చిరుని తెరపై ప్రజెంట్ చేసి సక్సెస్ అయ్యారు. ఇటీవలే బాలకృష్ణతో డాకు మహారాజ్ మూవీతో హిట్టు కొట్టిన బాబి మెగాస్టార్ తో మరో మూవీ కూడా చేయనున్నట్లు తెలుస్తోంది.
chiranjeevi : విశ్వంభరపై భారీ ఆశలు
వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ తర్వాత చిరు చేసిన బోలా శంకర్ బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. దీంతో మెగాస్టార్ విశ్వంభర మూవీతో సాలిడ్ కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు.
ఈ ఏజ్ లో కూడా చిరు మూవీ లైనప్ ను చూసి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. శ్రీకాంత్ ఓదెల, అనిల్ రావిపూడి, వెంకీ అట్లూరి, బాబి డైరెక్షన్లో సినిమాలు చేసి మెగాస్టార్ బాక్సాఫీస్ ని బద్దలు కొట్టాలని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. ఈ మూవీ లైనప్ లో మొదట ఏది తెరకెక్కిస్తారో చూడాలి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..