ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (Andhra Pradesh Chief Minister) చంద్రబాబు నాయుడు స్విట్జర్లాండ్‌లోని డావోస్ (Davos)లో పర్యటిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Microsoft founder Bill Gates)తో పాటు అనేక మంది అంతర్జాతీయ కార్పొరేట్ అధిపతులతో ఈ రోజు చంద్రబాబు నాయుడు ( N Chandrababu Naidu) సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షిస్తూ తద్వారా అనేక ప్రాజెక్టులను స్థాపించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా వీరి మధ్య చర్చలు, ఒప్పందాలు జరిగాయి.
చంద్రబాబు Davos పర్యటన.. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కీలకం
స్విస్ రిసార్ట్ టౌన్‌లో చంద్రబాబు నాయుడు ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఈ భేటీ కీలకం కానుంది. యునిలీవర్, డీపీ వరల్డ్ గ్రూప్, పెట్రోనాస్, గూగుల్ క్లౌడ్, పెప్సి, ఆస్ట్రాజెనెకా వంటి కంపెనీల అధిపతులతో సమావేశమై రాష్ట్ర పెట్టుబడుల అవకాశాల గురించి చంద్రబాబు నాయుడు చర్చించారు. ముఖ్యంగా బిల్ గేట్స్‌తో చర్చలు రాష్ట్రానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడుల కల్పనలో కీలక పాత్ర పోషించనుంది.
గ్రీన్‌కోతో ఒప్పందం
పునరుత్పత్తి ఇంధన రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న గ్రీన్‌కో సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. పునరుత్పత్తి శక్తి, గ్రీన్ హైడ్రోజన్ తదితర రంగాల్లో రాష్ట్ర అభివృద్ధికి ఇది దోహదపడుతుంది.
ఆర్గానిక్ వ్యవసాయం.. గ్రీన్ హైడ్రోజన్
బహుళ రౌండ్‌టేబుల్ సమావేశాల్లో పాల్గొన్న చంద్రబాబు నాయుడు ఆర్గానిక్ వ్యవసాయం, మానవ మిషన్ కొలబ్రేషన్, పునరుత్పత్తి విద్యుత్ వంటి అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌ను పర్యావరణ అనుకూల రాష్ట్రంగా నిలబెట్టడంలో ఇది ముందడుగు కానుంది.
బ్రాండ్ ఆంధ్రను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తూ రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను మెరుగు పర్చడం చంద్రబాబు నాయుడు ముఖ్యోద్దేశం. పెట్రోకెమికల్ హబ్ నిర్మాణం అనే అంశంపై జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోకెమికల్ పరిశ్రమల వృద్ధి సాధ్యాసాధ్యాలను వివరించారు.
పెట్రోకెమికల్ హబ్ కోసం..
విశాఖపట్నం, రామాయపట్నం వంటి కేంద్రాలు ఇప్పటికే పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 640 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పెట్రో కెమికల్ హబ్ స్థాపన కానుంది. భారతదేశంలో అతిపెద్ద పెట్రోలియం, కెమికల్స్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (PCPIR)కు ఆంధ్రప్రదేశ్ అనుకూల రాష్ట్రమని ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు. ఇది 640 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉందని తెలిపారు.రాష్ట్రంలోని పారిశ్రామిక వృద్ధికి బలం చేకూర్చే విధంగా పెట్టుబడిదారులను ఆహ్వానించారు. రవాణా, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక రంగాల్లో పెట్టుబడులను రాబట్టడంపై ఆసక్తి కనబర్చారు.
Davos tour : చంద్రబాబు పర్యటన.. పక్కా ప్రణాళిక
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పర్యటనలో వివిధ అంతర్జాతీయ సదస్సులు, సమావేశాల్లో పాల్గొంటూ రాష్ట్ర అభివృద్ధికి మార్గాలను వెతుకుతున్నారు. ఈ పర్యటనలో తీసుకున్న చర్యలు, చర్చలు రాష్ట్రాన్ని సాంకేతిక పారిశ్రామిక హబ్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..