ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (Government of Andhra pradesh) అందరికీ ఇల్లు పథకం (Andariki Illu Scheme) అమలుకు సంబంధించి మార్గదర్శకాల (Guidelines )ను విడుదల చేసింది. రాష్ట్ర రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా ఈ రోజు (సోమవారం) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేసి ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
Andariki Illu Scheme : నిలువ నీడ కల్పించేందుకు..
పేద కుటుంబాలకు గృహ సౌకర్యం అందించడమే అందరికీ ఇల్లు పథకం ముఖ్యోద్దేశం. సొంత భూమి లేక నిలువ నీడలేని వారికి గృహ వసతిని కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిని ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెచ్చింది.
అర్హతలు ఏముండాలంటే..
అందరికీ ఇల్లు పథకం (Andariki Illu Scheme)లో భాగంగా పేద కుటుంబాలకు 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల వారికి 2 సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయించనున్నారు. వీటిని పూర్తిగా ప్రభుత్వ భూముల నుంచే కేటాయించాల్సి ఉంటుంది. ఈ పథకంలో లబ్ధి చేకూరాలంటే దరఖాస్తుదారులు నిర్దిష్ట ఆదాయ పరిమితికి లోపడి ఉండాలి. సొంత ఇల్లు లేదా, స్థలం కలిగి ఉండొద్దు. గ్రామ పంచాయతీలు లేదా మునిసిపల్ అధికారుల నుంచి నివాస ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలి. ప్రధానంగా మహిళల పేరిట ఈ పథకాన్ని మంజూరు చేయనున్నారు. ఆదివాసీ, వెనుకబడిన తరగతుల కుటుంబాలకు మొదటి ప్రాధాన్యం ఉంటుంది. కూలీగా పని చేసే వ్యక్తులు, రోజు వారి ఉపాధి పొందే వారు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ప్రాధాన్యమిస్తారు. వృద్ధులు, అనాథలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రత్యేక కేటాయింపులు ఉంటాయి.
ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
అందరికీ ఇల్లు పథకం()లో లబ్ధి పొందాలనుకొనే వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అర్హులైన వారికి క్షేత్రస్థాయిలో స్థలాలను పరిశీలించి కలెక్టర్ల ద్వారా కేటాయిస్తారు. ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం అవసరమైన ఆర్థిక సాయాన్ని అందిస్తుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    