Survey on TG Employees | తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులు కష్టజీవులు.. అంకితభావం, నిబద్ధత కలిగిన వారు. తమ విధుల్లో ఎక్కువ సమయాన్ని వెచ్ఛిస్తారు. ఈ మాటలు అంటున్నదెవరో కాదు.. సాక్షాత్తు ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యురాలి రూపొందించిన నివేదికలే చెబుతున్నాయి. ఇండియాలో వారానికి 70 గంటల పని చేయాలని నిబంధనలు ఉన్నప్పటికీ తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగులు అంతకన్నా ఎక్కువ సమయమే వెచ్ఛిస్తూ విధులు నిర్వర్తిస్తున్నారని వెల్లడైంది.
TG Employees : రోజుకు ఎన్ని గంటలు పని చేస్తున్నారంటే..
తెలంగాణ రాష్ట్రం (Telangana) లోని ఉద్యోగులు రోజుకు సగటున 433 నిమిషాలు (7.21 గంటలు) పనిచేస్తున్నారు. ఇది దేశ సగటు 422 నిమిషాలు (7.03 గంటలు) కంటే ఎక్కువ. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు ఆరు రోజుల పని వారాన్ని పరిగణనలోకి తీసుకుంటే వారానికి సగటు 43.26 గంటలు పనిచేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వానికి నివేదిక
భారతదేశంలో ఉద్యోగుల పనిగంటలపై అధ్యయనం ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యురాలు డాక్టర్ షమ్మికా రవి ఓ అధ్యయనం చేశారు. దాని నివేదికలు కేంద్ర ప్రభుత్వానికి అందించారు. భారతదేశంలో ఉద్యోగులు రోజుకు సగటున 422 నిమిషాలు (7.03 గంటలు) పనిచేస్తున్నారు. ఆరు రోజుల పని వారాన్ని పరిగణనలోకి తీసుకుంటే వారానికి 42.2 గంటలు అవుతుంది.
తమిళనాడు ఉద్యోగులు 7.26 గంటలు
TN Employees పని గంటల విషయంలో దాద్రా అండ్ నగర్ హవేలీ అండ్ దామన్ అండ్ ద్యూ కేంద్ర పాలిత ప్రాంతం మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడి ఉద్యోగులు రోజుకు 600 నిమిషాలకు పైగా (10 గంటల కంటే ఎక్కువ) పనిచేస్తున్నారు. తమిళనాడు ఉద్యోగులు రోజుకు 436 నిమిషాలు (7.26 గంటలు) పనిచేస్తున్నారు. వీరి తర్వాతి స్థానంలో తెలంగాణ ఉద్యోగులు నిలిచారు. రోజుకు సగటున 7.21 గంటలు పని చేస్తున్నారని వెల్లడైంది. గోవా, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని చోట్ల మాత్రం రోజుకు 360 నిమిషాలకు తక్కువ (6 గంటల కంటే తక్కువ) పనిచేస్తున్నారని నివేదిక చెబుతోంది.
ఈ అధ్యయనం ఆరేళ్ల క్రితం నాటి డేటా ఆధారంగా రూపొందించారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే www.eacpm.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
One thought on “TG Employees | తెలంగాణ ఉద్యోగులు కష్టజీవులు.. సర్వేలో ఆసక్తికర విషయాలు..”