Kazipet station | కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేపట్టిన అమృత్ భారత్ స్టేషన్ పథకం (ABSS) కింద కాజీపేట రైల్వే స్టేషన్ పునరాభివృద్ధిపనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రయాణీకులకు సౌకర్యాలను మెరుగుపరిచేందుకు చేపట్టిన పనులు ఇప్పటికే 40% పూర్తయ్యాయి. రూ. 24.45 కోట్ల వ్యయంతో దక్షిణ మధ్య రైల్వే (SCR) చేపట్టిన ఈపనులు ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా పూర్తయ్యే అవకాశం ఉంది.
Table of Contents
Kazipet station | అభివృద్ధి పనులు ఇవీ ..
Kazipet station Redevelopment Works : కాజీపేట రైల్వే స్టేషన్ ముఖద్వారాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు.అలాగే స్టేషన్‌లోపల రెండు లిఫ్ట్‌లు, ఎస్కలేటర్‌లతో కూడిన 12-మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ (FOB) నిర్మిస్తున్నారు. ప్లాట్‌ఫారమ్‌లకు మెరుగులు దిద్దడంతోపాటు వెయిటింగ్ ఏరియాలు, అత్యాధునిక మరుగుదొడ్లు, వికలాంగ ప్రయాణీకులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. .
మరిన్ని పనులు. వెయిటింగ్ హాల్స్, ల్యాండ్‌స్కేపింగ్, ట్రాఫిక్ సర్క్యులేషన్ మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతున్నారు. స్టేషన్ పరిసరాల్లో భారతీయ, ఓరుగల్లు సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా చిత్రాలు, పెయింటింగ్స్ వేస్తున్నారు. రైలు, కోచ్ సూచిక బోర్డులు మరింత స్పష్టంగా ఆకర్శణీయంగా మార్చుతున్నారు.
కాజీపేట స్టేషన్ ఎందుకు కీలకం..
కాజీపేట స్టేషన్ చాలా పురాతనమైనంది.. దేశ స్వాతంత్ర్యానికి పూర్వమే రైల్వే (NGSR)లో భాగంగా 1888లో కాజీపేట రైల్వే స్టేషన్ ను నిర్మించారు. ఇది అత్యంత కీలకమైన సికింద్రాబాద్-ఢిల్లీ మార్గంలో ఉంది. బొగ్గు, పత్తి, ఇతర వస్తువుల రవాణాకు కాజీపేట కేంద్రంగా ఉంది. ఇది వరంగల్, హన్మకొండ వంటి సమీప ప్రాంతాలను భారతదేశం అంతటా ప్రధాన నగరాలకు కలిపే కీలకమైన జంక్షన్‌గా కొనసాగుతోంది, సగటున రోజుకు 24,269 మంది ప్రయాణికులు కాజీపేట స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. ఇక స్టేషన్ వార్షిక ఆదాయం రూ. 41.36 కోట్లు.
సికింద్రాబాద్-బల్హర్షా విభాగంలో ఉన్న ప్రధాన కాజీపేట స్టేషన్, న్యూ ఢిల్లీ, హౌరా, చెన్నై, విజయవాడ, విశాఖపట్నం, సికింద్రాబాద్, తిరుపతి వంటి గమ్యస్థానాలకు ముఖ్యమైన సూపర్ ఫాస్ట్ రైళ్లతో సహా 98 రైలు హాల్ట్‌లకు సేవలు అందిస్తుంది.
తెలంగాణ వ్యాప్తంగా 40 స్టేషన్లు
అమృత్ భారత్ స్టేషన్ పథకం (ABSS ) కింద తెలంగాణలోని 40 స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధ చేస్తోంది. అందులో కాజీపేట ఒకటి, ఇది భారతీయ రైల్వేల పలు స్టేషన్లను ఆధునీకరించడంతోపాటు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందిస్తోంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో రద్దీని తగ్గించేందుకు రూపొందించిన సికింద్రాబాద్(Secundrabad), చర్లపల్లి (Charlapalli) స్టేషన్ల పునరాభివృద్ధి చేసింది. కేంద్రం తెలంగాణలోని రైల్వేస్టేషన్ల ఆధునికీకరణకోసం దాదాపు రూ.2,737 కోట్లు ఖర్చుచేస్తోంది.
𝐊𝐚𝐳𝐢𝐩𝐞𝐭 𝐑𝐚𝐢𝐥𝐰𝐚𝐲 𝐒𝐭𝐚𝐭𝐢𝐨𝐧 in Telangana is undergoing a major facelift under the Amrit Bharat Station Scheme.
Progress: 40% complete
Cost: ₹24.45 Cr pic.twitter.com/sEKXUImcDH— G Kishan Reddy (@kishanreddybjp) January 28, 2025
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








