భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు వినోద్ కాంబ్లీ (Vinod Kambli) భార్య ఆండ్రియా హెవిట్ (Andrea Hewitt) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన భర్తకు విడాకులు ఇవ్వాలనుకున్నా గానీ, ఆయన అనారోగ్య స్థితిని చూసి నిర్ణయాన్ని మార్చుకున్నానని వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో ఆండ్రియా హెవిట్ ఈ కామెంట్లు చేయడం సంచలనం సృష్టించింది.
వదిలి వెళ్లిపోదామనుకున్నా : Andrea Hewitt
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ సూర్యాంశీ పాండే నిర్వహించిన ఒక పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఆండ్రియా హెవిట్ మాట్లాడారు. కాంబ్లీతో వైవాహక బంధానికి స్వస్తి పలకాలని 2023లో విడాకుల కోసం దరఖాస్తు చేశానని వెల్లడించారు. ఆయన మద్యానికి బానిసైపోవడం తమ వైవాహిక జీవితంపై ఎంత తీవ్ర ప్రభావం చూపిందో వివరించారు.
ఆయన ఎలా బతుకుతాడన్నదే బెంగ
కాంబ్లీని వదిలి వెళ్లిపోవాలని ఎప్పుడూ అనుకొనే దాన్నని, ఆయన అనారోగ్యం కారణంగా ఆ పని చేయలేకపోయానని ఆండ్రియా చెప్పారు. దీంతో విడాకుల కోసం చేసుకున్న దరఖాస్తును వెనక్కి తీసుకున్నానని తెలిపారు. తనకు ఎప్పుడూ ఆయన గురించే బెంగ ఉంటుందన్నారు. అనారోగ్యం కారణంగా ఆయన పడే బాధను చూడలేకపోతున్నా అని ఆవేదన వ్యక్తం చేశారు. కాంబ్లీని ఈ స్థితిలో వదిలి వెళ్లిపోతే ఆయన ఎలా బతుకుతాడదనేదే తన బెంగ అన్నారు.
కాంబ్లీకి అనారోగ్య సమస్య
కాంబ్లీకి ఆండ్రియా రెండో భార్య. 2006లో ప్రైవేట్ సెరిమనీలో వారిద్దరూ ఒక్కటయ్యారు. ఇటీవల కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి అభిమానులను ఎంతో ఆందోళనకు గురి చేసింది. డిసెంబరు 21న యూరినరీ ఇన్ఫెక్షన్, క్రాంప్స్ కారణంగా కాంబ్లీ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు మెదడులో రక్తం గడ్డకట్టిన సమస్య కూడా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. కొన్ని రోజుల చికిత్స తర్వాత డిశ్చార్జ్ చేశారు.
Andrea Hewitt.. బాధ్యత గల భార్య
కొద్దిరోజుల క్రితం ముంబైలో జరిగిన వాంఖడే స్టేడియం 50వ వార్షికోత్సవ వేడుకలకు వినోద్ కాంబ్లీ హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో భార్య ఆండ్రియా సహాయంతో ఆయన నడుస్తూ స్టేడియంలోకి ప్రవేశించారు. భార్యగా కాంబ్లీతో తనకున్న బంధానికి ప్రతీకగా ఆండ్రియా చూపిన బాధ్యతను చూసి అక్కడున్న వారందూ అబ్బురపడ్డారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..