Hit -4 Movie | నేచురల్ స్టార్ నాని (Natural star Nani) హీరోగానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా ఇండస్ట్రీలో తనదైన మార్క్ ని చూపెడుతున్నారు. తను హీరోగా వచ్చిన గత చిత్రం సరిపోదా శనివారం ఆగస్టులో రిలీజ్ అయి మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. వివేకా ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ కొంత మంది ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఇందులో నాని యాక్టింగ్, ఎస్ జె సూర్య విలన్ రోల్ లో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశారు. అంతకుముందు దసరా, హాయ్ నాన్న లాంటి మూవీస్ తో నాని హిట్టు కొట్టారు.
ఒకపక్క హీరోగా చేస్తూనే మరోవైపు మంచి స్టోరీస్ వింటూ వాటిని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అందులో విశ్వక్సేన్ హీరోగా శైలేష్ కొలను డైరెక్షన్లో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై 2020లో హిట్ (Hit ) అనే మూవీ తెరకెక్కింది. డైరెక్టర్ గా శైలేష్ కొలనుకి (Shailesh kolanu) ఇదే మొదటి సినిమా. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ గా వచ్చిన ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంది. దీనికి కొనసాగింపుగా హిట్ -2 మూవీ తెరకెక్కింది. ఈ సెకండ్ కేస్ లో భాగంగా హీరోగా అడవి శేషు యాక్ట్ చేశారు. హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటించారు.ఈ మూవీ కూడా వాల్పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు హిట్-2 మూవీకి కొనసాగింపుగా హిట్ -3(hit-3)వస్తోంది. ఇందులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా నాని యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీకి కూడా శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. దీనిలో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి (Srinidhi shetti) కనిపించనున్నారు.
శైలేష్ కొలను గత చిత్రం విక్టరీ వెంకటేష్ హీరోగా 75 వ సినిమాగా సైంధవ అనే మూవీని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.వెంకటేష్ కెరీర్ లో ఒక మైలు రాయిల నిలిచి పోతుందనుకున్న ఈ మూవీ సరిగా ఆడకపోవడం వెంకీ అభిమానులు డిజపాయింట్ అయ్యారు.
ఇదిలా ఉండగా నాచురల్ స్టార్ నాని హిట్ 3 మూవీని ఫాస్ట్ గా కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన ఒక పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. అందులో నాని గన్ పట్టుకొని ఉన్న తీరు చూసి అభిమానులు అంచనాలను పెంచేసుకుంటున్నారు. హిట్ సిరీస్ లో భాగంగా గత రెండు సినిమాలు కూడా మంచి విజయాలు సాధించడం, అదే డైరెక్టర్ ఈ మూవీకి కూడా పనిచేస్తుండడంతో ఈ మూవీ నాని కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకుంటున్నారు.
ఇకపోతే దీని షూటింగ్ జరుగుతూ ఉండగానే ఫిలింనగర్లో ఓ వార్త చెక్కర్లు కొడుతుంది. హిట్-4 కచ్చితంగా ఉంటుందని దానిలో హీరోగా ఒక మాస్ హీరో పేరు వినిపిస్తోంది. Hit-1 లో విశ్వక్ సేన్, hit-2 లో అడవి శేషు, హిట్ 3లో నాని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లుగా నటించారు. దీనికి కొనసాగింపుగా వచ్చే Hit -4 Movie లో మాస్ మహారాజా రవితేజ (mass maharaj Ravi Teja) నటిస్తారని ఫిలిం నగర్ టాక్. ఇదే నిజమైతే రవితేజ కెరీర్లో ఒక మంచి హిట్టు గ్యారెంటీ అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
ఈ మధ్యన రవితేజ సినిమాలన్ని బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలుస్తున్నాయి. ఈ మూవీలో యాక్ట్ చేస్తే ఒక కొత్త రకం పాత్రలో రవితేజని చూడొచ్చని ఆశ పడుతున్నారు. ఇందులో నిజం ఎంతో తెలియదు…కానీ మూవీ టీమ్ మాత్రం హిట్ -3 చిత్రీకర ణలో బిజీగా ఉన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








