Thandel Trailer Released | అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్న మూవీ తండేల్ (Thandel). కార్తికేయ సినిమాతో మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న చందు మొండేటి (chandhu mondeti) డైరెక్షన్లో నాగచైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి(Sai pallavi) హీరో,హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న కొద్ది మూవీ మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేశారు. ఇప్పటివరకు విడుదలైన మూడు సాంగ్స్ కి ఫ్యాన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. వారు వింటేజ్ దేవిశ్రీ ని(DSP ) చూస్తున్నామంటున్నారు. అంతలా డీఎస్పీ మ్యూజిక్ ఉంది.
ఇక ఈరోజు రిలీజ్ చేసిన ట్రైలర్ (Thandel Trailer ) సాయి పల్లవి డైలాగ్ తో మొదలవుతుంది. ‘రాజు.. ఊర్లో అందరూ ఏటెటో మాట్లాడుకుంటున్నార్రా…’అని సాయి పల్లవి అనగానే ‘మన గురించి మాట్లాడుతార్రు అంటే మనం ఫేమస్ అయిపోయినట్టేనే ‘ అని నాగచైతన్య డైలాగు చెప్పడం చూస్తే ఒక క్యూట్ లవ్ స్టోరీని వారి మధ్య మళ్లీ చూడబోతున్నాం అనిపిస్తుంది. అప్పుడు వచ్చే బీజీఎం అదిరిపోయింది. రాజుగా నాగచైతన్య, సత్యగా సాయి పల్లవి పర్ఫామెన్స్ తో ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించే విధంగా ట్రైలర్ ని కట్ చేశారు.
వీరిద్దరి కాంబినేషన్లో శేఖర్ కమ్ముల డైరెక్షన్లో లవ్ స్టోరీ అని మూవీ వచ్చింది. ఆ మూవీలో వీరి మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. రిపీట్ కాంబినేషన్ , అందులో వీరి కాంబినేషన్ కి ఆడియన్స్ లో ఒక క్రేజ్ ఉంది కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్ చందు మొండేటి వీరి క్యారెక్టర్ లను సృష్టించారని అనిపిస్తుంది. ఒక మత్స్యకారుడు సముద్రంలో చేపల వేటకు వెళ్లి పాకిస్తాన్ సైన్యానికి చిక్కుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే కథగా తెలుస్తోంది. తండేల్ అంటే లీడర్ అని ఒక దగ్గర డైలాగ్ రావడంతో ఫస్టాఫ్ రెండు గ్రూపుల మధ్య వార్ గా, అందులోనే ఒక చక్కటి లవ్ స్టోరీ గా నడిచి, సెకండాఫ్ కొచ్చేసరికి సత్య సముద్రంలోకి వెళ్ళకు అని చెప్పిన రాజు కొన్ని పరిస్థితుల్లో సముద్రంలోకి వెళ్లడం, అక్కడ సైన్యానికి చిక్కడం,అక్కడి నుండి మళ్లీ రాజు, సత్యలు ఎలా కలుస్తారనేది స్టోరీగా నడుస్తుందని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇందులో సీనియర్ యాక్టర్ పృథ్వి కూడా ఒక క్యారెక్టర్ చేశారు.
Thandel Trailer అదిరిపోయేలా పాటలు
ఇక మ్యూజిక్ గురించి చెప్పుకోవాలంటే ఇప్పటికే దేవిశ్రీప్రసాద్ (Devisri Prasad) మూడు సూపర్ సాంగ్స్ తో అదరగొట్టేశారు. తర్వాత వచ్చే సాంగ్స్ కూడా ఇంతకుమించి ఉంటాయనడంలో సందేహం లేదు. ఇందులో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సీన్స్ అప్పుడు వచ్చే బిజిఎం అయినా…పాకిస్తాన్ సైన్యానికి చిక్కినప్పుడు హీరో అక్కడి వాళ్ళతో ఫైటింగ్ చేస్తున్నప్పుడు వచ్చే వందేమాతరం బిజిఎం అయినా… వేరే లెవల్లో ఉంది. వింటేజ్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ లో ఉన్న మ్యాజిక్ చాలా ఏళ్ల తర్వాత ఈ మూవీలో చూడబోతున్నాం అనిపిస్తుంది. ఫిబ్రవరి 7న రిలీజ్ అయ్యే ఈ మూవీ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి…
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








