MMTS Trains | విమానాశ్రయం తరహాలో అత్యాధునిక హంగులతో అభివృద్ధిచేసిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ (Charlapalli Railway terminal) ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. ఇక్కడి నుంచి కొన్ని రైళ్లను కూడా ప్రారంభించింది దక్షిణ మధ్ రైల్వే.. ప్రయాణికులతో పోటెత్తుతున్న సికింద్రాబాద్(Secunderabad), నాంపల్లి, కాచిగూడ రైళ్లే స్టేషన్లపై ఒత్తడిని తగ్గించేందుకుచర్లపల్లి నుంచి మరిన్ని రైళ్లను నడిపించాలని భారతీయ రైల్వే ప్రణాళికలు రూపొందిస్తోంది.
చర్లపల్లి రైల్వే టెర్మినల్‌నుంచి 25 జతల రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే భావిస్తోంది. సికింద్రాబాద్ లో ఒత్తిడి తగ్గించి తొలిదశలో 10 జతల రైళ్లను చర్లపల్లి నుంచి నడిపించనుంది. కానీ ఇక్కడ ప్రధానమైన సమస్య ఎదురవుతోంది. చర్లపల్లికి కనెక్టివిటీకి అవసరమైన ఎంఎంటీఎస్ రైళ్లు ఇప్పటివరకు అందుబాటులో లేవు. ప్రస్తుతం ఈ మార్గంలో ఒకే ఎంఎంటిఎస్ రైలు (MMTS Trains ) నడుస్తోంది. మేడ్చల్, కాచిగూడ, హైదరాబాద్, లింగంపల్లి, తెల్లాపూర్, ఫలక్‌నుమా నుంచి చర్లపల్లికి రైళ్ల రాకపోకలను బట్టి ఎంఎంటీఎస్ సర్వీస్ లను పెంచాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
Yadadri MMTS Trains : యాదాద్రికి ఎంఎంటీఎస్ రైలు కోసం ఎదురుచూపు
మరోవైపు యాదాద్రికి రైల్వేలైన్ (Yadadri Railway line) పనులను ప్రారంభించనున్నట్టు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గతేడాది ప్రకటించారు. ఏడేళ్లుగా పెండింగ్ ప్రాజెక్టు ఓ కొలిక్కి వచ్చినట్లు అందరూ భావించారు. హైదరాబద్ కు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాదాద్రికి చేరుకోవాలంటే రోడ్డు మార్గం ద్వారా వెళితే 2గంటల టైం పడుతోంది. అదే ఎంఎంటీఎస్ అందుబాటులోకి వొస్తే రూ.20 టిక్కెట్‌పై కేవలం గంట సమయంలోనే చేరుకోవచ్చు. ఘట్‌కేసర్ నుంచి రాయగిరి, అక్కడి నుంచి యాదాద్రికి లైన్ వేయాలని రైల్వే శాఖ అధికారులు ప్రతిపాదించారు. ప్రస్తుతం ఘట్‌కేసర్ (Ghatkesar) వరకు పనులు పూర్తికాగా.. మరో 33 కిలోమీటర్ల మేర పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈసారి బడ్జెట్‌లో నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..