Yadagiri Gutta Temple : తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి (Yadagiri Gutta) ఆలయానికి మహర్దశ పట్టనుంది. త్వరలో తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) తరహాలో ప్రత్యేక బోర్డు ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులను కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర మంత్రులు దేవాదాయశాఖ అధికారులతో కలిసి సమీక్షించారు. యాదగిరిగుట్ట బోర్డు నియామకపు నిబంధనలపై ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ధర్మకర్తల మండలి ఏర్పాటు కోసం రూపొందించిన ముసాయిదాలో పలు మార్పులను సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో మాదిరిగానే యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామి ఆలయం (Yadadri LakshmiNarasimha swami temple ) సమీపంలో రాజకీయాలకు తావు లేకుండా చూడాలని, ఆలయ పవిత్రతకు ఏమాత్రం భంగం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.
యాదగిరి గుట్ట ఆలయం (Yadagiri Gutta Temple) ధర్మకర్తల మండలి నియామకంతో పాటు ఆలయం తరఫున చేపట్టాల్సిన ముఖ్యమైన ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలపై ముసాయిదాలో పేర్కొన్న నిబంధనలకు సీఎం మార్పులు సూచించారు.
Yadagiri Gutta : టెంపుల్ టూరిజంపై ఫోకస్
దేశ, విదేశాల పర్యాటకులను ఆకర్షించేలా టూరిజం పాలసీ (Temple Tourism Policy)ని రూపొందించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ప్రధానంగా టెంపుల్, ఎకో టూరిజంపై దృష్టి సారించనుంది. రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి ఆస్కారం ఉన్న, అవసరమైన ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సింగపూర్ తరహా ఎకో టూరిజం విధానాలను పరిశీలించాలని ఆయన సూచించారు. .
ఫిబ్రవరి 10 వ తేదీలోగా అత్యుత్తమ పర్యాటక విధానాన్ని సిద్దం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దేశ, విదేశాల్లోని అత్యుత్తమ పాలసీని అధ్యయనం చేసి తెలంగాణ పర్యాటక పాలసీని రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. టూరిజం పాలసీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupalli Krishnarao), టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రధాన ఆలయాలతో సర్కూట్
అతిపెద్ద గిరిజన జాతర అయిన సమ్మక్క-సారలమ్మ (Sammakka Saralamma Jatara) జాతర సమయంలో భక్తులు, పర్యాటకులను ఆకర్షించేందుకు రెవెన్యూ, అటవీ, పర్యాటక శాఖలు సంయుక్తంగా ప్రణాళికలు రూనపొందించనున్నారు. జాతరతో పాటు సమీప పర్యాటక ప్రాంతాలు, ఆలయాలను కలుపుతూ ఒక సర్క్యూట్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
వరంగల్, నాగార్జునసాగర్(Nagarjuna Sagar), ఆదిలాబాద్ లాంటి ప్రాంతాలలో ఎకో టూరిజంను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. వచ్చే గోదావరి, కృష్ణా పుష్కరాలకు దేశవ్యాప్తంగా భక్తులు, పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. హైదరాబాద్ నగరంలో హుస్సేన్‌సాగర్ (Hussain Sagar) పరిసరాల్లోని సంజీవయ్య పార్క్, ఇందిరా పార్క్, ఎన్టీఆర్ గార్డెన్ లను కలుపుతూ టూరిజం సర్క్యూట్‌ను అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. . పర్యాటక అభివృద్ధితో రాష్ట్రానికి మరింత గుర్తింపు, ఆదాయం వచ్చేలా ఈ పాలసీని రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. .
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..