Sarkar Live

Chiranjeevi : చిరు మూవీకి రాక్ స్టార్ మ్యూజిక్…?

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi ) సినిమాకు మ్యూజిక్ ఇవ్వడం అనేది అందరి మ్యూజిక్ డైరెక్టర్లకు ఒక కల. తను ఇచ్చే మ్యూజిక్ లో మెగాస్టార్ స్టెప్పులు వేస్తే చాలు అనుకుంటారు. మెగాస్టార్ కెరియర్ స్టార్టింగ్ లో ఎక్కువగా చక్రవర్తి మ్యూజిక్

Vishvambhara

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi ) సినిమాకు మ్యూజిక్ ఇవ్వడం అనేది అందరి మ్యూజిక్ డైరెక్టర్లకు ఒక కల. తను ఇచ్చే మ్యూజిక్ లో మెగాస్టార్ స్టెప్పులు వేస్తే చాలు అనుకుంటారు. మెగాస్టార్ కెరియర్ స్టార్టింగ్ లో ఎక్కువగా చక్రవర్తి మ్యూజిక్ ఇచ్చేవారు. వీరి కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి.

ఖైదీ, యమకింకరుడు,జేబుదొంగ, చక్రవర్తి,వేట,అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, పసివాడి ప్రాణం, అడవి దొంగ, జేబుదొంగ,మంచి దొంగ ఇలా ఎన్నో సినిమాలకు మ్యూజిక్ అందించాడు. అప్పటికి చక్రవర్తి టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ మెగాస్టార్ సినిమాలకు వర్క్ చేయడం కూడా సినిమాలు హిట్ అవ్వడానికి ఉపయోగపడ్డాయి.

ఇళయ రాజా కాంబినేషన్ లో..

తర్వాత ఇళయరాజా, మెగాస్టార్ కాంబినేషన్లో కూడా అనేక సినిమాలు వచ్చి మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పటికీ రాక్షసుడు సినిమాలోని పాటలు ఫేవరెట్ గా అందరూ చెబుతుంటారు. ఇళయరాజా తర్వాత రాజ్ కోటి ఒక దశాబ్దన్నర పాటు ఉర్రూతలూగించారు. అప్పుడు ఉన్న టాప్ హీరోలందరితో వర్క్ చేసి ఇండస్ట్రీ హిట్లు కొట్టారు. మెగాస్టార్ కి వీరు ఇచ్చిన పాటలకు ఇప్పటికీ విజిల్స్ పడుతుంటాయి. రాజా విక్రమార్క,ముఠామేస్త్రి, హిట్లర్ ,బిగ్ బాస్ ఇలా చాలా సినిమాలకు చిరుతో పని చేశారు. ఎప్పటికప్పుడు ఆ జనరేషన్ కు తగ్గట్టుగా మ్యూజిక్ డైరెక్టర్ లతో వర్క్ చేస్తుంటారు చిరు.

Chiranjeevi – Manisharma మణిశర్మతో మురుపురాని హిట్స్..

వీరి తర్వాత మణిశర్మ కు అవకాశం ఇచ్చి తనలో ఉన్న టాలెంట్ ను ఎంకరేజ్ చేశాడు. చూడాలని ఉంది, బావగారు బాగున్నారా, అంజి, యువరాజు, స్టాలిన్, ఇంద్ర, ఠాగూర్ ,ఇలా వరుసగా మణిశర్మతోనే వర్క్ చేశాడు. వీరి కాంబినేషన్లో వచ్చిన ఆఖరి మూవీ ఆచార్య డిజాస్టర్ గా నిలిచింది. చిరు మూవీస్ కి మణిశర్మ మాత్రమే సినిమాలు చేస్తారని పేరు ఉన్న టైంలో యువ కెరటం డిఎస్పి (Devisri Prasad) దూసుకొచ్చాడు. చిరుతో మూవీ చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. జయంతి సీ పరాన్జీ డైరెక్షన్లో శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీతో అవకాశం ఇచ్చి ఎంకరేజ్ చేశాడు. తను కూడా చిరు ఫ్యాన్స్ ని డిసపాయింట్ చేయకుండా సూపర్ సాంగ్స్ ఇచ్చాడు. డిఎస్పి, చిరు కాంబినేషన్ కూడా మంచి హిట్టుగా నిలిచిపోయింది. వీరి కాంబినేషన్లో శంకర్ దాదా ఎంబిబిఎస్, అందరివాడు, శంకర్ దాదా జిందాబాద్, సినిమాలు వచ్చాయి.

చిరు (Chiranjeevi ) రాజకీయాలకు గుడ్ బై చెప్పి తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఖైదీ నంబర్ 150 అనే మూవీ తీశాడు. దానికి కూడా డీఎస్పీనే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకున్నాడు. ఇలా చాలామంది మ్యూజిక్ డైరెక్టర్ లు చిరు నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు.

తమన్ దాదాపు తెలుగులో ఉన్న టాప్ హీరోలందరికీ మ్యూజిక్ ఇచ్చాడు. ఒక్క చిరుకు మాత్రమే పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. మోహన్ రాజా డైరెక్షన్ లో వచ్చిన గాడ్ ఫాదర్ మూవీకి వర్క్ చేసినా అందులో ఒకే సాంగ్ ఉండడంతో తమన్ ఫ్యాన్స్ డిసపాయింట్ అయ్యారు. మెగాస్టార్ కు అన్ని పాటలతో ఒక మూవీ చేయాలనే కోరిక ఇంకా అలాగే మిగిలిపోయింది.

మెగాస్టార్ లాస్ట్ మూవీ బోళా శంకర్ మూవీకి మణిశర్మ తనయుడు మహతీ సాగర్ మ్యూజిక్ అందించాడు. కాకపోతే ఈ మూవీలో తన మ్యూజిక్ తో ఆకట్టుకోలేకపోయాడు. ఇక ఇప్పుడు విశ్వంభర మూవీ రాబోతుంది. చాలా సంవత్సరాల తర్వాత చిరు మూవీకి ఎం ఎం కీరవాణి (MM Keeravani) మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు. ఇంతకు ముందు వీరి కాంబినేషన్లో ఘరానా మొగుడు, ఆపద్బాంధవుడు, మూవీస్ వచ్చి అన్ని పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. చాలా ఏళ్ల తర్వాత చిరు మూవీలో ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం వినడానికి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

ఇక చిరు విశ్వంభర మూవీ తర్వాత అనిల్ రావిపూడి (Anil Ravipudi), శ్రీకాంత్ ఓదెల (Srikanth odela) డైరెక్షన్లో మూవీస్ చేయబోతున్నారు. ఈ మూవీస్ కి మ్యూజిక్ ఎవరు ఇవ్వబోతున్నారనే చర్చ టాలీవుడ్ లో నడుస్తుంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రీసెంట్గా బ్లాక్ బస్టర్ అయిన సంక్రాంతికి వస్తున్నాం మూవీకి బీమ్స్ సిసిరిలియో మ్యూజిక్ అదరగొట్టాడు. తనతో ఇంకా ప్రయాణం కొనసాగుతుందని అనిల్ రావిపూడి కూడా చెప్పాడు. ఇక చిరు మూవీకి బీమ్స్ ఖరారు అయినట్టుగా కూడా తెలుస్తోంది.

ఇక శ్రీకాంత్ ఓదెల చిరుతో చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఈ మూవీలో సాంగ్స్ కు పెద్దగా ప్రియార్టీ ఇవ్వకపోవచ్చు. ఇంతకుముందే వింటేజ్ చిరుని చూపించబోనని ఒక కొత్త చిరును చూపిస్తానని ఆ డైరెక్టర్ చెప్పుకొచ్చారు. బిజీ ఎం వరకే ఈ మ్యూజిక్ డైరెక్టర్ పరిమితమయ్యే ఛాన్స్ ఉంది. తమిళ్ లో టాప్ హీరోల సినిమాలకు అదరగొట్టేలా బీజీఎం ఇస్తున్న రాక్ స్టార్ అనిరుద్ (Anirudh) పేరు తెరపైకి వచ్చింది. ఇది నిజమైతే మెగా కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీ ఎలా ఉంటుందో ఊహించుకుంటూ మెగా ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. అనిరుద్ బాస్ మూవీకి అదరగొట్టేస్తాడని ధీమాగా చెబుతున్నారు. ఈ వార్తలపై మూవీ టీమ్ స్పందించాల్సి ఉంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?