Union Budget 2025 : మధ్యతరగతి కుటుంబాలకు, ఉద్యోగులకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Union Finance Minister Nirmala Sitharaman) శుభవార్త చెప్పారు. రూ. 12 లక్షల వరకు ఆదాయం ఉన్న వాళ్లు ఇకపై ఇన్‌కం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని ప్రకటించారు. ఈ రోజు పార్లమెంటులో వార్షిక బడ్జెట్ (Union Budget 2025) ప్రవేశపెట్టిన ఆమె ఈ గుడ్‌న్యూస్ చెప్పారు.
ఆశలు నెరవేర్చిన కేంద్రం
ఇన్‌కం ట్యాక్స్ విషయంలో చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు కోరుతూ వస్తున్నారు. దీంతో కేంద్ర ఈ నిర్ణయం తీసుకుంది. నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదోసారి ఈ బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండగా ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే. బడ్జెట్‌పై ఆసక్తిగా పేదలు, మధ్య తరగతి, వేతన జీవులు ఎదురు చూశారు. చివరకు వారి ఆశలు నెరవేరాయి.
Union Budget 2025 : మధ్య తరగతి కుటుంబాలకు ఊరట
కొంతకాలంగా మధ్య తరగతి ప్రజలు, చిరు ఉద్యోగులు ఆదాయపు పన్ను (Income Tax) తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్ననిర్ణయం వల్ల వారి ఖర్చులకు, పొదుపులకు కాస్త ఊరట లభిస్తుంది. ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో నిత్యావసర సరుకులు, ఇంధనం, గృహ రుణాలు, విద్య ఖర్చులు వంటివి పెరుగుతున్నాయి. ఆదాయపు పన్ను మినహాయింపు వల్ల ప్రజలకు కొన్ని లక్షలు ఆదా అవుతాయి.
వేతన జీవులకు ఉపశమనం
వేతన జీవుల ఆదాయంలో చాలా భాగం పన్నుల రూపంలో పోతుండటంతో వారు ఆర్థికంగా కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు కొత్త పన్ను విధానం వల్ల వారికే ఎక్కువ ప్రయోజనం చేకూరనుంది.
Union Budget 2025 ఆదాయపు పన్ను స్లాబ్ | ఆదాయపు పన్ను రేటు |
---|---|
0 – 4 లక్షలు | నిల్ |
4 – 8 లక్షలు | 5% |
8 – 12 లక్షలు | 10% |
12 – 16 లక్షలు | 15% |
16 – 20 లక్షలు | 20% |
20 – 24 లక్షలు | 25% |
24 లక్షలకు పైనే | 30% |
ప్రభుత్వ ఆదాయంపై ప్రభావం
పన్ను మినహాయింపు వల్ల మొదట్లో ప్రభుత్వం కొంత ఆదాయాన్ని కోల్పోవచ్చు. కానీ.. దీని వల్ల మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఖర్చు చేస్తారు. దీనివల్ల వ్యాపార రంగం అభివృద్ధి చెందుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల వద్ద డబ్బు ఎక్కువగా మిగిలితే, ఆర్థిక వ్యవస్థలో నిధుల ప్రవాహం పెరుగుతుందని అంటున్నారు. దీని ద్వారా పరోక్షంగా ప్రభుత్వానికి ఇతర రకాల ఆదాయాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సాధారణ ప్రజలు, ఉద్యోగులు, చిరు వ్యాపారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. మధ్య తరగతి ప్రజలకు ఇది ఉపశమనం కలిగించే నిర్ణయమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..