NTPC Recruitment 2025 : భారత ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి సంబంధించి భారీ నోటిఫికేషన్‌ను విడుదలైంది. దీని ద్వారా మొత్తం 475 పోస్టులను భర్తీ చేయనున్నారు. గేట్-2024 స్కోర్ ఆధారంగా ఎంపిక ప్రక్రియను నిర్వహించనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది,. ఫిబ్రవరి 13, 2025 చివరి తేదీగా నిర్ణయించారు.
ఖాళీల వివరాలు:
ఈ నోటిఫికేషన్‌లో మొత్తం 475 ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. విభాగాల వారీగా ఖాళీల వివరాలు కింది విధంగా ఉన్నాయి:
- మెకానికల్ : 180 పోస్టులు
- ఎలక్ట్రికల్ : 135 పోస్టులు
- ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్ : 85 పోస్టులు
- సివిల్ విభాగం – 50 పోస్టులు
- మైనింగ్ : 25 పోస్టులు
విద్యార్హత ఏముండాలి?
NTPC Recruitment 2025 Eligibility : అభ్యర్థులు ఫుల్ టైం బ్యాచిలర్ డిగ్రీ (B.E/B.Tech) ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీ లేదా AMIEలో ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 65% మార్కులు సాధించి ఉండాలి (SC/ST/దివ్యాంగ అభ్యర్థులకు 55% మినహాయింపు ఉంది). గేట్-2024 స్కోర్ తప్పనిసరి.
వయోపరిమితి
అభ్యర్థుల వయస్సు 27 సంవత్సరాలు మించకూడదు (SC/ST/OBC అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది).
జీతభత్యాలు
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.40,000 – రూ.1,40,000/- మధ్య వేతనం లభిస్తుంది.
ఎంపిక విధానం
అభ్యర్థుల ఎంపిక గేట్-2024 స్కోర్, షార్ట్‌లిస్టింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా జరుగుతుంది.
దరఖాస్తు ఫీజు:
- రూ.300/- (జనరల్ అభ్యర్థులకు)
- SC/ST/PWD/మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు.
NTPC Recruitment 2025 : దరఖాస్తు విధానం:
అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు ప్రారంభం: ఇప్పటికే ప్రారంభం
- దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 13, 2025
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..