RTC Tickets in WhatsApp : పౌరసేవల్లో సాంకేతికతను విరివిగా వినియోగంలోకి తెస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) కొత్తగా మరో విధానాన్ని ప్రవేశపెట్టింది. వాట్సాప్ ద్వారా ఆర్టీసీ బస్సు టికెట్‌ను బుక్ చేసుకొనే సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ప్రయాణికులు బస్సును సులభంగా బుక్ చేసుకొని వేగవంత సేవలు పొందొచ్చు. ఇప్పటి వరకు బస్సు టికెట్లను బుక్ చేసుకోవడానికి ప్రయాణికులు ఆర్టీసీ వెబ్‌సైట్‌ను వినియోగించే వారు. లేదా టికెట్ కౌంటర్ వద్దకు వెళ్లేవారు. అయితే ఇప్పుడు ఈ కొత్త సౌకర్యం ద్వారా మొబైల్‌లో ఉన్న WhatsApp యాప్ ద్వారానే టికెట్ బుక్ చేసుకోవచ్చు.
RTC Tickets in WhatsApp : ప్రయాణికులకు పెద్ద ఊరట
వాట్సాప్ ద్వారా ఆర్టీసీ టికెట్ బుక్ చేసుకొనేందుకు ఏపీ ప్రభుత్వం కొత్త సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో ప్రయాణికులకు (Passengers) పెద్ద ఊరట లభించింది. ముఖ్యంగా పల్లె నుంచి పట్టణాలకు, పట్టణాల నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారికి ఈ కొత్త విధానం ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. వాట్సాప్ ద్వారా ఎక్కడి నుంచైనా టికెట్ బుక్ చేసుకోవచ్చు. తద్వారా కొద్ది నిమిషాల్లోనే టికెట్ పొందొచ్చు. కౌంటర్ల వద్ద క్యూలో నిలబడే అవసరం లేదు. బస్సు స్టేషన్‌కు వెళ్లకుండానే కేవలం మొబైల్ ఫోన్ ద్వారా UPI, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లాంటి ఆన్‌లైన్ చెల్లింపులతో టికెట్ (RTC Ticket) పొందొచ్చు. స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఈ సేవను సులభంగా వినియోగించుకోవచ్చు.
చేసే పద్ధతి ఇదీ..
- RTC Tickets in WhatsApp : ముందుగా మీ మొబైల్ ఫోన్‌లో WhatsApp ఓపెన్ చేసి, 9552300009 నంబర్‌కు Hi అని మెసేజ్ పంపాలి.
- ఆర్టీసీ నుంచి తిరిగి ఒక మెసేజ్ వస్తుంది. అందులో అన్ని సేవల గురించి సమాచారం ఉంటుంది.
- ఆ మెసేజ్‌లో ఉన్న RTC Ticket Booking అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- మీ ప్రయాణానికి సంబంధించిన వివరాలను నమోదు చేయాలి.
- ప్రయాణ ప్రారంభ ప్రాంతం (ప్రయాణం మొదలయ్యే బస్సు స్టేషన్ పేరు) పేర్కొనాలి.
- గమ్యం (మీరు వెళ్లాలనుకున్న స్టేషన్ పేరు) పేర్కొనాలి.
- మీరు ప్రయాణించాలకున్న తేదీని నమోదు చేయాలి.
- మీరు నమోదు చేసిన వివరాల ప్రకారం అందుబాటులో ఉన్న బస్సు టైమింగులు, బస్సు రకాలు (AC, Non-AC, సూపర్ లగ్జరీ, గరుడ తదితర), సీట్లు వంటి వివరాలు కనిపిస్తాయి.
- లిస్టులో మీరు బస్సును ఎంపిక చేసుకొని అందుబాటులో ఉన్న సీట్లలో మీకు కావాల్సిన నంబరును సెలెక్ట్ చేసుకోవచ్చు.
- సీటు సెలెక్ట్ చేసిన తర్వాత డిజిటల్ చెల్లింపు చేయాల్సి ఉంటుంది. దీనికోసం మీరు UPI (PhonePe, Google Pay, Paytm), డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు వంటి చెల్లింపు పద్ధతులను ఉపయోగించుకోవచ్చు.
- చెల్లింపు పూర్తయిన వెంటనే టికెట్ నేరుగా మీ WhatsApp నంబర్‌కు వస్తుంది. టికెట్ రద్దు చేసే విధానం
- ఎప్పుడైనా మీ ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలంటే అదే WhatsApp నంబరుకు Cancel Ticket అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేయాలి.
- మీరు బుక్ చేసిన టికెట్ PNR నంబరు లేదా టికెట్ నంబరు పేర్కొనాలి.
- మీరు రద్దు అభ్యర్థన పంపిన వెంటనే మీ WhatsAppకు ఒక ధృవీకరణ మెసేజ్ వస్తుంది.
- టికెట్ రద్దు పాలసీ ప్రకారం రిఫండ్ అమౌంట్ మీ అకౌంట్‌లో 5-7 రోజుల్లో క్రెడిట్ అవుతుంది.
- ఆన్‌లైన్ ద్వారా చెల్లించిన వారికి UPI / బ్యాంక్ అకౌంట్‌కు నేరుగా డబ్బులు జమ అవుతాయి
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..