ISRO NVS 02 : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO ) జనవరి 29, 2025న తన 100వ ప్రయోగంగా జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మార్క్-2 (GSLV Mk-II) ద్వారా NVS-02 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. ఇది NavIC (Navigation with Indian Constellation) వ్యవస్థలో కీలక ఉపగ్రహం. అయితే.. ఇస్రోకు కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రయత్నం విఫలమైంది.
కక్ష్యలోకి ప్రవేశించని NVS-02
NVS-02 ఉపగ్రహాన్ని భారతదేశ సొంత నావిగేషన్ వ్యవస్థను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో రూపొందించారు. ముఖ్యంగా రక్షణ, ఆర్థిక, కమ్యూనికేషన్, విపత్తు నిర్వహణ, వ్యవసాయ రంగాలకు కీలకమైన సమాచారాన్ని అందించే సామర్థ్యం ఇందులో ఉంది. ఈ ఉపగ్రహం నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించలేకపోవడంతో ఈ ప్రయోజనాలపై అస్పష్టత ఏర్పడింది.
NVS-02 అసలు సమస్య ఏమిటి?
ISRO NVS 02 ఉపగ్రహాన్ని నిర్దేశిత భ్రమణ పథంలోకి పంపేందుకు ఆర్బిట్ రైజింగ్ ఆపరేషన్ (Orbit Raising Operation) చేపట్టాలి. సాధారణంగా ఇది ఉపగ్రహంలోని థ్రస్టర్ వ్యవస్థ (Thruster System) ద్వారా సాధ్యమవుతుంది. కానీ, ఈసారి థ్రస్టర్‌లకు ఆక్సిడైజర్‌ను పంపే వాల్వ్‌లు తెరుచుకోలేదు.
దీని వల్ల ఇస్రో అనుకున్న విధంగా ఉపగ్రహాన్ని Geostationary Orbit (GEO) లోకి తీసుకెళ్లలేకపోయింది.
ప్రస్తుత స్థితి ఏమిటి?
ఈ ఉపగ్రహం ప్రస్తుతం భూమిని ఎలిప్టికల్ జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (GTO) లో పరిభ్రమిస్తోంది.
ఇస్రో భూస్థిర స్థితిలోకి ప్రవేశపెట్టే మార్గాలను పరిశీలిస్తోంది. ఉపగ్రహంలోని ఇతర వ్యవస్థలు మాత్రం బాగానే పనిచేస్తున్నాయి. సోలార్ ప్యానెల్స్ విజయవంతంగా విస్తరించాయి. శక్తి ఉత్పత్తి సాధారణంగానే ఉంది. భూమి నుండిచి కమ్యూనికేషన్ కూడా సక్రమంగానే ఉంది.
NVS-02లోని ముఖ్య సాంకేతిక అంశాలు
NVS-02 ఉపగ్రహాన్ని గత నావిక్ ఉపగ్రహాల కంటే అద్భుతమైన ఫీచర్లతో రూపొందించారు. ప్రధానంగా ఇందులో ఉన్న రూబిడియం అటామిక్ క్లాక్ భారతదేశంలో రూపొందించిన మొట్టమొదటి అణు గడియారం. ఈ ఉపగ్రహంలోని స్మార్ట్ నావిగేషన్ వ్యవస్థ సమయ పరిమితికి అనుగుణంగా మరింత కచ్చితమైన స్థాన సమాచారాన్ని ఇస్తుంది. భారతదేశ వ్యప్తంగానే కాకుండా సమీప దేశాలకు శక్తిమంతమైన నావిగేషన్ సేవలను ఇది అందిస్తుంది.
ISRO NVS ప్రత్యామ్నాయ ప్రణాళికలు
ఉపగ్రహాన్ని పూర్తిగా ఉపయోగించుకునేలా వివిధ ప్రత్యామ్నాయాలను ఇస్రో పరిశీలిస్తోంది. ప్రస్తుత ఎలిప్టికల్ కక్ష్యలోనే ఇది పరిమితంగా పని చేస్తుంది కాబట్టి మరొక ఉపగ్రహాన్ని అక్కడికి పంపాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారమైనప్పటికీ ఇదే దీర్ఘకాలిక పరిష్కారం మని ఇస్రో భావిస్తోంది. డీప్ స్పేస్ నావిగేషన్ మిషన్ కోసం ఇది ఉపయోగపడుతుందని, భవిష్యత్ ప్రయోగాలకు దోహదం చేసే కీలక డేటాను ఇది అందించగలదని అంటోంది.
ఇస్రో భవిష్యత్ ప్రణాళికలు
ISRO NVS సంఘటనకు ఇస్రో తగిన సమాధానాలను కనుగొనడానికి ప్రయత్నిస్తోంది. భారతదేశం యొక్క NavIC నావిగేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా చూడాలని భావిస్తోంది. ఈ విఫల ప్రయోగం కూడా ఒక అనుభవంగా మారి భారతీయ అంతరిక్ష పరిశోధనలో కొత్త మార్గాలను తెరవబోతుంది. ఇస్రో సాంకేతిక లోపాలను అంచనా వేసి భవిష్యత్ ప్రణాళికల్లో మెరుగుదల చేయనుంది. భారతీయ శాస్త్రవేత్తలు కొత్త ఉపగ్రహ నావిగేషన్ మోడళ్లపై పరిశోధనలు ముమ్మరం చేస్తున్నారు. భారతదేశం భవిష్యత్ నావిగేషన్ వ్యవస్థలకు మరింత గట్టి భద్రతా చర్యలు చేపట్టనుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..