పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) నుండి మూవీ వచ్చి చాలా సంవత్సరాలే అయింది.ఆఖరుగా సముద్రఖని డైరెక్షన్ లో బ్రో మూవీ వచ్చి అట్టర్ ప్లాప్ అయింది. తర్వాత ఆయన రాజకీయాల్లో బిజీ అయ్యారు. అంతకుముందే క్రిష్(krish) డైరెక్షన్ లో హరిహర వీరమల్లు(Hari hara veeramallu),సుజీత్ డైరెక్షన్ లో ఓజీ(OG), హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమాలకు సైన్ చేసిన పవన్ సెట్స్ మీదకు కూడా తీసుకెళ్ళాడు.
ఆ తర్వాత ఎన్నికలు రావడం.. కూటమి అధికారంలోకి రావడంతో ఆ మూవీస్ ఆగిపోయాయి.దీంతో పవర్ స్టార్ అభిమానులు డిసప్పాయింట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఏ మీటింగ్ కు వెళ్లిన ఓజి ఓజి అని ఫ్యాన్స్ అరుస్తూనే ఉన్నారు. దీంతో పవన్ ఒకసారి ఫ్యాన్స్ పై అసహనం కూడా వ్యక్తం చేశారు. ప్రెజెంట్ వారి ఆకలిని తీర్చేలా రెండు మూవీస్ ఇప్పుడు లైన్ లో ఉన్నాయి. అందులో ఒకటి హరిహర వీరమల్లు, రెండోది ఓజీ ఈ రెండు మూవీల షూటింగు దాదాపు అయిపోయింది.ఇంకా కొన్ని రోజులు పవన్ డేట్స్ ఇస్తే చాలు అవి కంప్లీట్ అయిపోతాయి.
ఈ మూవీ స్ లో హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ తేదీని ఇప్పటికే మేకర్స్ ఖరారు చేశారు. మార్చి 28న ఈ మూవీ థియేటర్లకు వస్తున్నట్లు చాలా రోజుల క్రితమే ప్రకటించారు. అయితే రిలీజ్ తేదీ దగ్గర పడుతున్నా పవన్ ఇప్పటి వరకు సెట్స్ లో అడుగు పెట్టకపోవడంతో ఇప్పట్లో మూవీ రిలీజ్ కాదని వాయిదా పడే అవకాశం ఉందని కొన్ని రోజులుగా పుకార్లు వినిపిస్తున్నాయి. అదే రోజు పవన్ ఫ్యాన్ అయినా హీరో నితిన్ రాబిన్ హుడ్ మూవీ కూడా రాబోతుంది. దీనివల్ల కూడా హరిహర వీరమల్లు వెనక్కి తగ్గే అవకాశం కూడా ఉందని టాక్ వినిపించింది. కానీ మూవీ మేకర్స్ మార్చి 28 వ తేదీనే మూవీ విడుదలవుతుందని ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్స్ లో, గ్లింప్స్ లో వేశారు. అయినా కూడా హరిహర వీరమల్లు కంటే ముందు ఓజీ మూవీనే మొదట వస్తుందనే ప్రచారం జరిగింది. దీనిపై తాజాగా మూవీ ప్రొడ్యూసర్ అనుకున్న తేదీనే మూవీ రిలీజ్ అవుతుందని మరోసారి స్పష్టం చేశారు. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
Pawan Kalyan : కొంతకాలంగా బిజీ
భారీ బడ్జెట్ తో రెండు పార్టులుగా రాబోతున్న ఈ మూవీని మొదట క్రిష్ డైరెక్ట్ చేశారు. చాలా వరకు షూటింగ్ అయిపోయాక పవన్ రాజకీయా ల్లో బిజీ అయ్యారు. దీంతో సినిమా చిత్రీకరణ మధ్యలోనే ఆగిపోయింది. క్రిష్ ఈ గ్యాప్ లో కొండపొలం అనే మూవీని వైష్ణవ్ తేజ్ తో చేసి విడుదల కూడా చేశారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది.
ఈ మూవీ తర్వాత పవన్ డేట్స్ ఇస్తాడేమోనని చాలా రోజులు వేచి చూసి దర్శకత్వ బాధ్యతలు నుండి పక్కకు తప్పుకున్నారు.దీంతో మూవీ దర్శకత్వ బాధ్యతలను ప్రొడ్యూసర్ ఎఎం రత్నం (AM Rathnam) కొడుకైన జ్యోతి కృష్ణ (Jyothi krishna)అందుకుని మిగిలిన షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు.మొగలుల కాలం నాటి కథ తో పీరియాడిక్ డ్రామాగా వస్తున్న ఈ మూవీలో నిధి అగర్వాల్ హిరోయిన్ గా నటిస్తోంది. దాదాపు 90% షూటింగ్ కూడా అయిపోయింది. కాగా మూవీ నుంచి తప్పుకున్న క్రిష్ ప్రస్తుతం అనుష్కతో మూవీ చేస్తున్నారు.
షూటింగ్ చివరి దశకు చేరుకున్న Pawan Kalyan హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ దగ్గర పడుతున్నా కొద్ది మేకర్స్ మూవీ అప్డేట్స్ ఫాస్ట్ గా ఇచ్చే పనిలో ఉన్నారు. చాలా రోజుల క్రితం పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక గ్లింప్స్ ను విడుదల చేయగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. పవన్ అదిరి పోయే యాక్షన్ ఎపిసోడ్లో అదరగొట్టడం, దానికి తోడు ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి బీజీఎం మూవీ పై అంచనాలను పెంచేసింది. ఈ మధ్యన ఒక సాంగ్ ని కూడా రిలీజ్ చేశారు.
ఐదు భాషల్లో కూడా పవన్ కళ్యాణ్ పాడడం (Pawan Kalyan Songs) విశేషం. మాట వినాలి అనుకుంటూ వచ్చే ఈ సాంగ్ పవన్ ఫ్యాన్స్ కి తెగ నచ్చేసింది. రెండో సింగిల్ ని ఫిబ్రవరి 14న రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇలా మూవీ రిలీజ్ దగ్గర పడుతున్న కొద్ది మేకర్స్ హరిహర వీరమల్లును మర్చిపోకుండా ఉండేలా ఆడియన్స్ కి దగ్గర చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా వస్తున్న హరిహర వీరమ ల్లు మూవీతో పవన్ కళ్యాణ్ మార్చి 28 న అన్ని ఇండస్ట్రీలను షేక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








