Pragraj Kumbh Mela 2025 | ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) ఈరోజు కుంభమేళాలో ప్రత్యేక పూజలు నిర్వహించి పుణ్యస్నానం ఆచరించారు. ఉత్తరప్రదేశ్ లోని టెంపుల్ సిటీ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా (Maha Kumbh Mela 2025) లో పాల్గొన్నారు. ఆయన త్రివేణి సంగమం వద్ద పూజలతోపాటు పుణ్యస్నానం చేశారు. బుధవారం ప్రయాగ్ రాజ్‌కు చేరుకున్న ప్రధాని మోదీ… ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి కుంభమేళా త్రివేణి సంగమానికి వెళ్లారు. అక్కడి అరైల్ ఘాట్ నుంచి పడవలో సంగం ఘాట్‌కు చేరుకున్నారు ఆ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహాకుంభమేళా ప్రాంతం గురించి సీఎం యోగీ ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ను అడిగి సమాచారం తెలుసుకున్నారు. ఆ తర్వాత సంగం ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు చేశారు. . ఆ సమయంలో ప్రధాని మోడీ చేతిలో రుద్రాక్ష జపమాల పట్టుకుని మంత్రాలు జపిస్తూ త్రివేణి సంగమంలో స్నానమాచరించారు.
భారతదేశ ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడానికి మరియు సంరక్షించడానికి తన నిబద్ధతకు అనుగుణంగా, ప్రధానమంత్రి తీర్థయాత్ర స్థలాలలో మౌలిక సదుపాయాలు మరియు సౌకర్యాలను పెంచడానికి నిరంతరం చురుకైన చర్యలు తీసుకుంటున్నారు.
Kumbh Mela : ఇది నా అదృష్టం.. : ప్రధాని మోదీ
కాగా కుంభమేళాలో పాల్గొనడంపై ప్రధాని మోదీ X లో ఒక వీడియో పోస్ట్ చేశారు. “మహా కుంభమేళా 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అంటే అనేక తరాలకు ఒకసారి వస్తుంది. ఇలాంటి చారిత్రాత్మక క్షణంపై ఎవరూ రాజకీయాలు చేయకూడదు. పవిత్ర త్రివేణి సంగమంలో స్నానం చేయడం నా అదృష్టం. మహా కుంభమేళాకు వచ్చే మొత్తం ప్రజల సంఖ్య అపూర్వమైనది. ఊహించలేనిది కాబట్టి దయచేసి అందరూ మార్గదర్శకాలను పాటించండి. #మహా కుంభమేళా” అని రాశారు.
#WATCH | Prime Minister Narendra Modi takes a holy dip at Triveni Sangam in Prayagraj, Uttar Pradesh #PMModi #UttarPradesh pic.twitter.com/jMvaflxdxj
— TIMES NOW (@TimesNow) February 5, 2025
ఇదిలా ఉండగా, బుధవారం ఉదయం 8 గంటల నాటికి, 3.748 మిలియన్లకు పైగా భక్తులు గంగా, యమునా, సరస్వతి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. ఇది గొప్ప హిందూ సమాజంలో ఉన్న భక్తి, ఆధ్యాత్మిక భావాలను ప్రతిబింబిస్తుంది. వీరిలో 10 లక్షలకు పైగా కల్పవాసీలు, దైవిక ఆశీర్వాదం కోసం తెల్లవారుజామున వచ్చిన 2.748 మిలియన్ల యాత్రికులు ఉన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..









1 Comment
[…] ప్రధాని మోదీ ((Prime Minister Narendra Modi) ఈ పర్యటనలో కొన్ని క్రూర జంతువులతో మెలిగారు. సాధారణంగా మనుషులకు దూరంగా ఉండే కొన్ని అరుదైన జంతువులను దగ్గరగా వెళ్లి పరిశీలించారు. ఆసియాటిక్ సింహపు కూనలు, తెల్ల సింహపు కూన, క్లౌడెడ్ చిరుత, కారకల్ కూనలకు స్వయంగా ఆహారం పెట్టారు. ఇవన్నీ వంతారాలో సంరక్షణ పొందుతున్న జంతువులే. […]