S Jaishankar : అక్రమంగా నివసిస్తున్నారంటూ అమెరికా నుంచి భారతీయులను తిరిగి పంపించడం ( deportation of alleged illegal Indian immigrants)పై విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (External Affairs Minister S Jaishankar) స్పందించారు. విదేశాల్లో అక్రమంగా నివసిస్తున్న భారత పౌరులను తిరిగి స్వీకరించడం సర్కారు బాధ్యత అన్నారు. దాన్ని పాటించక తప్పదన్నారు. జైశంకర్ మొదటి ప్రసంగం ఈ రోజు రాజ్యసభ (Rajya Sabha)లో జరిగింది. ఆ తర్వాత లోక్‌సభలో కూడా ఆయన మాట్లాడారు.
చర్చనీయాంశంగా Jaishankar కామెంట్స్
అమెరికా (US)లో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను తిరిగి పంపడంపై విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఉభయ సభల్లో చేసిన ప్రకటన పెద్ద చర్చనీయాంశమైంది. ఏ దేశమైనా తమ పౌరులను చట్టబద్ధంగా పరిరక్షించుకోవడానికి, వారికి సహాయం చేయడానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని, అదే సమయంలో ఇతర దేశాల్లో అక్రమంగా నివసించే వారి విషయంలో సంబంధిత దేశాల నిబంధనలను గౌరవించాల్సిన బాధ్యత కూడా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. వలసదారులను తిరిగి పంపించే సమయంలో అమెరికా ఎలాంటి దశ్చర్యలకు పాల్పడకుండా చూడాల్సిన బాధ్యత భారత్‌పై ఉందని కూడా జైశంకర్ అన్నారు.
భారతీయులపై అమెరికా కఠిన చర్యలు
భారతీయులను తిరిగి పంపే ప్రక్రియ అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) ద్వారా నిర్వహించబడుతుంది. ICE 2012 నుంచి అమలు చేస్తున్న స్టాండర్డ్ ఓపరేటింగ్ ప్రొసీజర్ (SOP) ప్రకారం అక్రమ ఇమ్మిగ్రాంట్లను విమానాల ద్వారా తిరిగి పంపించే సమయంలో కొన్ని కఠిన చర్యలకు పాల్పడతారు. అయితే.. వీటిని మహిళలు, పిల్లలపై ఉపయోగించరని జైశంకర్ వెల్లడించారు. దీనిపై అంశంపై లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సభ మధ్యాహ్నం వరకు వాయిదా పడింది. ముఖ్యంగా కాంగ్రెస్ ఎంపీలు ఈ అంశంపై చర్చ జరపాలని పట్టుపట్టారు.
అమెరికాతో భారత్ చర్చలు
అమెరికా ప్రభుత్వంతో భారత ప్రభుత్వం చర్చలు జరుపుతోందని జైశంకర్ (S Jaishankar) తెలిపారు. ఈ క్రమంలోనే అక్రమ ఇమ్మిగ్రేషన్ (Immigration) రాకెట్‌లను గుర్తించి చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం భావిస్తోందన్నారు. అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించేందుకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి డంకీ రూట్స్ వంటి మార్గాలను ఉపయోగించిన పంజాబీ యువకుల సంఖ్య ఎక్కువగా ఉంది. వారికి ఆశలు చూపించి మోసం చేసిన ఇమ్మిగ్రేషన్ మాఫియాలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది.
తిరిగి వచ్చిన భారతీయులు వీరే..
ఇటీవల యూఎస్ సైనిక విమానం 104 మంది అక్రమ భారతీయ ఇమ్మిగ్రాంట్లను అమృత్‌సర్‌లోని శ్రీ గురు రామ్‌దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దింపింది. వీరిలో 33 మంది హర్యానా, 33 మంది గుజరాత్, 30 మంది పంజాబ్, ముగ్గురు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఇద్దరు చండీగఢ్ రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








